»Vijay Devarakonda If Only Vijay Devarakonda Did That The Girl Shocked
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ అలా చేస్తేనే.. అంటూ షాక్ ఇచ్చిన అమ్మాయి!
ప్రస్తుతం ఉన్న హీరోల్లో రౌడీ హీరో విజయ్ దేవర కొండకు కూడా మంచి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా యూత్‌లో రౌడీకి యమా క్రేజ్ ఉంది. రౌడీ కూడా వాళ్లకు సోషల్ మీడియాలో ఫుల్ కిక్ ఇస్తుంటాడు. కానీ ఓ అమ్మాయి మాత్రం రౌడీకే షాక్ ఇచ్చింది. దానికి విజయ్ కూడా స్వీట్ షాక్ ఇచ్చాడు.
Vijay Devarakonda: చివరగా ఖుషి సినిమాతో ఆడియెన్స్ ముందుకొచ్చిన విజయ్ దేవరకొండ.. త్వరలోనే ఫ్యామిలీ స్టార్ అనే సినిమతో థియేటర్లోకి రాబోతున్నాడు. గీతా గోవిందం కాంబినేషన్‌ను రిపీట్ చేస్తూ.. పరశురాం పెట్ల దర్శకత్వంలో ఫ్యామిలీ స్టార్ సినిమా చేస్తున్నాడు విజయ్. ఈ సినిమాలో రౌడీ సరసన సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో రౌడీ ఫ్యాన్స్ అంతా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ ఓ లేడీ అభిమాని మాత్రం విజయ్ దేవరకొండకి షాక్ ఇచ్చేలా పోస్ట్ చేసింది.
A girl made a reel on Instagram quoted – if #VijayDeverakonda comments on this video they will start exam preparation ✨
బెంగళూరులో చదువుకుంటున్న హర్షిత రెడ్డి అనే డై హార్డ్ ఫ్యాన్.. తన ఫ్రెండ్‌తో కలిసి ఉన్న వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇందులో.. విజయ్ దేవరకొండ ఈ వీడియోకి కామెంట్ చేస్తేనే తాము ఎగ్జామ్స్ కోసం చదవడం మొదలు పెడతామని కామెంట్ చేసింది. ఇక మామూలుగానే రౌడీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటాడు. దీంతో ఈ వీడియో కాస్త వైరల్ అవడంతో.. విజయ్ దేవరకొండ కంట పడినట్టుంది.
దీంతో వెంటనే విజయ్ దేవరకొండ ఆ అమ్మాయి వీడియోకి కామెంట్ పెట్టడమే కాదు.. మీకు 90 ప్లస్ వస్తే మిమ్మల్ని కలుస్తానని చెప్పి వారికి స్వీట్ షాక్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయినా కూడా విజయ్ దేవర కొండ చూడకుండా ఉండి ఉంటే.. నిజంగానే ఆ అమ్మాయిలు ఎగ్జామ్స్‌కి ప్రీపెరే అయి ఉండేవారు కాదా? ఏదేమైనా.. ఈ ఫ్యాన్స్ మాత్రం వేరే అనే చెప్పాలి.