Hero Sunil : సునీల్ ‘భువన విజయమ్’ నుంచి వీడియో రిలీజ్
టాలీవుడ్ (Tollywood) హీరో సునీల్ (Hero Sunil) నటిస్తోన్న చిత్రం భువన విజయమ్ (Bhuvana Vijayam). ఈ మూవీ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్(Teaser)ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. తాజాగా బర్త్ ఆఫ్ భువన విజయమ్ వీడియోను చిత్ర యూనిట్ లాంచ్ చేసింది.
టాలీవుడ్ (Tollywood) హీరో సునీల్ (Hero Sunil) నటిస్తోన్న చిత్రం భువన విజయమ్ (Bhuvana Vijayam). ఈ మూవీ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతోంది. ఈ మూవీకి యలమంద చరణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్(Teaser)ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. గతంలో ఈ మూవీ నుంచి ‘కథన కదనమున’ లిరికల్ వీడియో సాంగ్‌ను కూడా విడుదల చేశారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ను చిత్ర యూనిట్ తీసుకొచ్చింది. భువన విజయమ్ (Bhuvana Vijayam) నుంచి బర్త్ ఆఫ్ భువన విజయమ్ వీడియోను చిత్ర యూనిట్ లాంచ్ చేసింది.
బర్త్ ఆఫ్ భువన విజయమ్ వీడియో :
భువన విజయమ్ (Bhuvana Vijayam) మూవీలో ఫీలింగ్ స్టార్ ప్రీతమ్ కుమార్ పాత్రలో సునీల్ (Sunil) కనిపించనున్నట్లు తెలుస్తోంది. కొత్త సినిమా తీయాలనే నేపథ్యంలో సునీల్ అతని టీమ్ కలిసి చేసే ప్రయోగమే ఈ భువన విజయమ్ మూవీ కథాంశం. ఈ మూవీ నుంచి విడుదలైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ (Viral) అవుతోంది.
భువన విజయమ్ (Bhuvana Vijayam) మూవీలో థర్టీ ఇయర్స్ పృథ్వీరాజ్, జబర్దస్త్ రాఘవ, షేకింగ్ శేషు, రమణ, వెన్నెల కిశోర్ వంటివారు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. హిమాలయ స్టూడియో మ్యాన్షన్స్ బ్యానర్‌పై కిరణ్, వీఎస్కే ఈ మూవీని రూపొందిస్తున్నారు. సునీల్ (Sunil) ఈ సినిమాలోనే కాకుండా రజినీ కాంత్ (Rajinikanth) సినిమా జైలర్ (Jailer)లో కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే జైలర్ సినిమాకు సంబంధించి సునీల్ లుక్ విడుదల నెట్టింట వైరల్(Viral) అవుతోంది. ఈ సినిమాల్లోనే కాకుండా తమిళంలో మార్క్ ఆంటోనీ, జపాన్, మావీరన్, మిస్టర్ కింగ్ వంటి సినిమాల్లో సునీల్ (Sunil) నటిస్తున్నాడు.