టాలీవుడ్లో బాబాయ్-అబ్బాయ్ కాంబినేషన్ చూడ్డానికి చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. ఇప్పటి వరకు ఏదో గెస్ట్ రోల్స్ తప్పితే.. పవన్-చరణ్.. బాలయ్య-ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్.. వెంకటేష్-రానా కాంబినేషన్లో సినిమాలు రాలేదు. కానీ ఇప్పుడు వెంకీ-రానా కలిసి ప్రముఖ ఓటిటి సంస్థ నెట్‌ఫ్లిక్స్ కోసం ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. దాంతో ఈ వెబ్ సిరీస్ అప్డేట్స్ కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు దగ్గుబాటి అభిమానులు. ఈ క్రమంలో సర్ప్రైజ్ ఇస్తూ ‘రానా నాయుడు’ హిందీ టీజర్ రిలీజ్ చేశారు. ఇక ఈ టీజర్ చూసిన తర్వాత ‘రానా నాయుడు’ విధ్వంసం సృష్టించేలా ఉందంటున్నారు.
యాక్షన్, క్రైమ్ నేపథ్యంలో రానున్న ఈ సిరీస్‌లో వెంకీ, రానా తండ్రీ కొడుకులుగా నటించారు. ఇద్దరూ కూడా పోటీ పడి మరీ నటించినట్టు తెలుస్తుంది. సెలబ్రిటీల ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే నెగిటివ్ రోల్లో కనిపించబోతున్నాడు రానా. దాంతో ఆ కొడుకుని ఆపగలిగేది తండ్రి మాత్రమేనని చూపించారు. ఇక వెంకటేష్ ఊహించని మాసివ్ లుక్‌తో షాక్ ఇచ్చాడు. వయసు మళ్ళిన తండ్రి పాత్రలో పవర్ఫుల్ రోల్ ప్లే చేసినట్టు చూపించారు. మొత్తంగా ఈ టీజర్ సాలిడ్ యాక్షన్ అండ్ రొమాన్స్‌తో సాగింది. రానా లుక్ బీస్ట్ మోడ్‌లో ఉండగా.. వెంకీ రగ్గడ్ లుక్ అదరహో అనేలా ఉంది. నాయుడు టీజర్ చూసిన తర్వాత బాబాయ్, అబ్బాయ్ కలిసి మాసివ్ ట్రీట్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఈ సిరీస్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.