ప్రస్తుతం బాలయ్య ‘అన్ స్టాపబుల్ 2’ షోతో దుమ్ముదులుపుతున్నారు. అలాగే సంక్రాంతికి థియేటర్లో సందడి చేయడానికి రెడీ అవుతున్నారు. అఖండ బ్లాక్ బస్టర్‌ను కంటిన్యూ చేస్తూ మెగాస్టార్ చిరుకి పోటీగా.. సంక్రాంతి బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్న నటసింహం..
మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘వీర సింహా రెడ్డి’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రిలీజ్ టైం దగ్గర పడుడుతుండడంతో.. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి.. పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్ కార్యక్రమాలపై దృష్టి సారించాలని చూస్తున్నారు. అందుకే శరవేగంగా షూటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం అనంతపురంలో షూటింగ్ జరుగుతోంది..
ఇందులో బాలయ్య, విలన్లకు సంబంధించిన సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. దాంతో ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చని తెలుస్తోంది. అతి త్వరలోనే వీరసింహారెడ్డికి గుమ్మడి కాయ కొట్టనున్నారట. ఈ నేపథ్యంలో హీరో, హీరోయిన్ల పై ఓ సాంగ్ షూటింగ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. ఈ నెల 18 నుంచి హైదరాబాద్‌లో బాలయ్య, శృతి హాసన్ పై పాటను చిత్రీకరించబోతున్నారట. ఈ పాటతో దాదాపుగా షూటింగ్ మొత్తం కంప్లీట్ అవనుందని టాక్.
ఈ లెక్కన వీరసింహారెడ్డి సంక్రాంతి బరిలో నిలవడం పక్కా అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్, నవీన్ చంద్ర కీలక పాత్రలో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బట్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి.. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. మరి వీరసింహారెడ్డి బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేస్తుందో చూడాలి.