Pawan Kalyan: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఈజ్ బ్యాక్.. పవర్ ప్యాక్డ్ షెడ్యూల్!
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజి, హరిహర వీరమల్లు , ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ఈ సినిమాలపై భారీ అంచనాలున్నాయి. తాజాగా ఉస్తాద్ కోసవ రంగంలోకి దిగిపోయాడు పవర్ స్టార్.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ పై అనౌన్స్మెంట్ నుంచే అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా రీమేక్ సినిమా అని తెలిసిన కూడా హరీష్ శంకర్ మార్క్ టచ్‌తో కచ్చితంగా హిట్టు అనే నమ్మకంతో ఉన్నారు పవన్ ఫ్యాన్స్. ఎందుకంటే.. గతంలో హరీష్ శంకర్, పవన్ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ సూపర్ హిట్‌గా నిలిచింది. అందుకే ఉస్తాద్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే షూటింగ్ విషయంలో కాస్తా డిలే అవుతు వస్తోంది ఉస్తాద్.
కానీ ఇక పై మనల్నీ ఎవడ్రా ఆపేది.. అని అంటున్నాడు హరీష్ శంకర్. తాజాగా ఉస్తాద్ కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయింది. నిన్న హైదరాబాద్‌లో యాక్షన్ షెడ్యూల్ మొదలైంది. ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్‌సాయి నేతృత్వంలో భారీ సెట్‌ను రూపొందించారు. ఇక షూటింగ్ అప్డేట్ ఇస్తూ.. ఓ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇందులో పవన్ ఖాకీ డ్రెస్సులో పవర్ ఫుల్‌గా కనిపిస్తున్నాడు. అంతకు ముందే మైత్రి మూవీ మేకర్స్ వారు ఒక మాసివ్ యాక్షన్ షెడ్యూల్ ప్రారంభం కాబోతోందంటూ చెప్పేశారు.
ఈ సందర్భంగా.. హరీష్ శంకర్ కత్తులు, గొడ్డళ్లతో ఉన్న ఫోటోని షేర్ చేశారు. ఇక లేటెస్ట్ షెడ్యూల్ కూడా యాక్షన్ అని చెప్పడంతో పండగ చేసుకుంటున్నారు పవన్ ఫ్యాన్స్. ఈ షెడ్యూల్ ఉస్తాద్‌లో హైలెట్‌గా నిలుస్తుందని చెప్పొచ్చు. ఇక యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో సాక్షి వైద్య మరో హీరోయిన్గా నటిస్తోంది. గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్, పవన్ కాంబోలో వస్తున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.