»Ustaad Bhagat Singh When The Glass Is Broken Jump
Ustaad Bhagat Singh: గాజు పగిలిన కొద్దీ పదునెక్కుద్ది!
హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబోలో వస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమా నుంచి తాజాగా ఓ టీజర్ రిలీజ్ అయ్యింది. పవర్ఫుల్ డైలాగ్స్‌తో ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
Ustaad Bhagat Singh: హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబోలో వస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పటికప్పుడు లేటుగానే అవుతుంది. అయితే ఈ సినిమా నుంచి తాజాగా టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ చూస్తే.. సినిమానా లేకపోతే జనసేన ప్రమోషనా అన్నట్లు ఉంది. ఇది నీ రేంజ్ అంటూ రౌడీ టీ గ్లాసుని కిందపడేయడంతో టీజర్ మొదలవుతుంది. తర్వాత పవన్ కళ్యాణ్ గాజు పగిలిన కొద్దీ పదునెక్కుతుందంటూ గ్లాసు గురించి చెబుతాడు. ఈ టీజర్లో గాజు గ్లాసు, ఎర్ర తుండు ఎక్కువగా కనిపిస్తుంది. చివర్లో గ్లాసు అంటే సైజు కాదు.. కనిపించని సైన్యం అంటూ పవన్ చెప్పే డైలాగ్ అదిరిపోయింది. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారు. టీజర్లో ఓ చోట ఆమె కనిపించారు. అషుతోశ్ రాణా, నవాబ్ షా, బీఎస్ అవినాశ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేనీ, యలమంచిలి రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.