2023 సంక్రాంతికి కేవలం మెగాస్టార్ ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ సినిమాలు హోరా హోరీగా తలపడేందుకు రెడీ అవుతున్నాయి. అయితే కేవలం చిరు, బాలయ్య మధ్య మాత్రమే కాదు.. మ్యూజిక్ డైరెక్టర్స్ తమన్, దేవిశ్రీ ప్రసాద్ మధ్య కూడా పోటీ అంతకు మించి అనేలా నడుస్తోంది. వాల్తేరు వీరయ్యకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా..
తమన్ ‘వీరసింహారెడ్డి’కి మ్యూజిక్ ఇస్తున్నాడు. అయితే గత కొంత కాలంగా ఈ ఇద్దరి మధ్య గట్టి పోటీ నడుస్తోంది. కానీ ఈ మధ్య తమన్‌దే కాస్త పై చేయిగా ఉంది. వరుసగా హిట్ ఆల్బమ్స్ అందించాడు తమన్. దాంతో దేవి కాస్త వెనకపడిపోయాడనే టాక్ ఉంది. అందుకే వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి కంటే.. ఈ ఇద్దరి మ్యూజిక్ వార్ మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది.
మొన్న మెగాస్టార్ సినిమా నుంచి బాస్ వస్తుండు.. హెయ్.. హెయ్.. అంటూ దేవిశ్రీ మైక్ ముందు రచ్చ చేస్తే.. ఇక తమన్ ఏకంగా డప్పందుకొని బాలయ్య కోసం ఫీల్డ్‌లోకి దిగిపోయాడు. ఇప్పటికే దేవిశ్రీ పాటకు మంచి రెస్పాన్స్ వస్తుండగా.. ఇప్పుడు తమన్ కూడా అదరహో అనేలా ట్యూన్ ఇచ్చాడనే చెప్పాలి. తాజాగా ‘వీరసింహారెడ్డి’ నుంచి రిలీజ్ అయిన ‘జై బాలయ్య’ అంటూ సాగే ఫస్ట్ సింగిల్ నందమూరి అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తోంది.
అఖండతో తమన్ పై పెరిగిన అంచనాలను అందుకునేలా ఈ సాంగ్ ఉందంటున్నారు. కానీ ఈ రెండు పాటలపై కూడా కాపీ క్యాట్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దేవిశ్రీ ఓ తమిళ్ సాంగ్‌ను ఎత్తేసినట్టు చూపిస్తుండగా.. తమన్ మాత్రం ఒసేయ్ రాములమ్మా థిమ్ సాంగ్‌ను లేపిసినట్టు ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. మొత్తంగా ఇప్పుడు ఈ రెండు పాటల గురించే జోరుగా చర్చ జరుగుతోంది.