These are the movies coming in OTT and theater this week
Eagle: మాస్ మహరాజ రవితేజ్(Ravi teja) హీరోగా, కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన భారీ యాక్షన్ మూవీ ఈగల్. సంక్రాంతి బరిలో నిలవాల్సిన ఈ చిత్రం చివరి నిమిషంలో వెనక్కి తగ్గి ఈ వారం ఫిబ్రవరి 9న ప్రేక్షకులను అలరించడానికి థియేటర్లో విడుదల అవుతుంది. అనుపమ పరమేశ్వర్, కావ్య థాపర్ కథనాయకలుగా నటిస్తున్న ఈ సినిమాలో మంచి అంచనాలే ఉన్నాయి. భారీ మాస్ యాక్షన్ బ్యాగ్డ్రాఫ్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రవితేజ చాలా వినుత్నంగా కనిపిస్తున్నారు.
చదవండి:Guntur Kaaram: ఓటీటీలోకి రాబోతున్న గుంటూరు కారం.. ఎప్పుడంటే?
సూపర్ స్టార్ రజనీకాంత్(Rajanikanth) ప్రధాన పాత్రలో విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా తెరకెక్కిన చిత్రం లాల్ సలామ్. రజనీకాంత్ కూతురు ఐశర్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం క్రికెట్ చుట్టు జరిగే ఓ డ్రామా. మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ ఓ అతిథి పాత్రలో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉన్నాయి. ఫిబ్రవరి 9న విడుదల కాబోతుంది.
పవన్ కల్యాణ్(Pawan Kalyan), తమన్నా హీరోహరోయిన్లుగా పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కెమెరమెన్ గంగతో రాంబాబు. 2012లో విడుదలైన ఈ చిత్రం ఫిబ్రవరి 7న థియేటర్లో రీరిలీజ్ అవుతుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథా ఆధారంగా మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, వైఎస్ఆర్ కొడుకు పాత్రలో జీవా నటించిన చిత్రం యాత్ర2. ఈ చిత్రం ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ట్రూ లవర్ అనే మీడియం బడ్జెట్ చిత్రం ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఓటీటీ చిత్రాలు
గుంటూరు కారం ఫిబ్రవరి 9న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
కెప్టెన్ మిల్లర్ ఫిబ్రవరి 9న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
బబుల్ గమ్ ఫిబ్రవరి 9న ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.
అయలాన్ ఫిబ్రవరి 9న సన్ నెక్ట్స్ స్ట్రీమింగ్ అవుతోంది.
చదవండి:Miss Perfect: మిస్ పర్ఫెక్ట్.. నిజంగానే పర్ఫెక్ట్ వెబ్ సిరీస్..!

