ఇప్పటికే SSMB29 ప్రాజెక్ట్ గ్లోబ్ ట్రాటింగ్ ఫిల్మ్ అంటూ.. ఒక్కసారిగా అంచనాలు పెంచేశాడు రాజమౌళి. ఇక ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా అంటే.. ఔననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమాతో బిజీగా ఉన్నాడు మహేష్ బాబు. ఈ సినిమా అయిపోగానే దర్శకధీరుడితో ట్రావెల్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాతోనే మహేష్ పాన్ ఇండియా మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్నాడు. అంతేకాదు హాలీవుడ్ ఎంట్రీ కూడా ఫిక్స్ అయిపోయిందని తెలుస్తోంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఇక భారీ ప్రాజెక్ట్‌ను ఏకకాలంలో తెలుగుతో పాటు ఇంగ్లీష్‌లో కూడా షూట్ చేయనున్నారట.
పాన్ ఇండియాతో పాటు దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాతో హాలీవుడ్ దృష్టిని ఆకర్షించాడు రాజమౌళి. అందుకే మహేష్ సినిమాను తెలుగుతో పాటు ఇంగ్లీష్‌లోను ప్లాన్ చేస్తున్నట్టు టాక్. మిగతా భాషల్లో ఈ అడ్వెంచర్ మూవీని డబ్ చేయనున్నారట. ఒకవేళ నిజంగానే జక్కన్న హాలీవుడ్ ప్లానింగ్‌లో ఉంటే మాత్రం.. ఈ సినిమా నెక్స్ట్ లెవల్లో ఉండడం ఖాయమంటున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో హీరోయిన్ గురించి మరో న్యూస్ హల్ చల్ చేస్తోంది. ఫిల్మ్ క్రిటిక్, ఓవర్సీస్ సెన్సార్ బోర్డు అని చెప్పుకునే సభ్యుడు ఉమైర్ సంధు.. మహేష్ సరసన ఆలియా భట్ ఓకే అయిందని ట్వీట్ చేశాడు. అది కూడా డెలివరీ తర్వాత షూటింగ్లో పాల్గొనబోతున్నట్టు చెప్పుకొచ్చాడు. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియకపోయాని.. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.