ఈమధ్యకాలంలో సోషల్ మీడియాలో సమంత(Samantha) పేరు ఎక్కువగా వినిపిస్తోంది. సోషల్ మీడియాలో ఆమె ఎమోషనల్ నోట్లు, కోట్స్ పెడుతూ వస్తోంది. అలాగే ఆమె నటిస్తున్న పాన్ ఇండియా సినిమా శాకుంతలం(Shaakuntalam) గురించి కూడా నెట్టింట టాక్ నడుస్తోంది. గతేడాది సమంత(Samantha) తాను మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపింది. ఆ విషయం తెలియడంతో అభిమానులంతా షాక్ కు గురయ్యారు. యశోద సినిమా ప్రమోషన్ లో కూడా సమంత కంటతడి పెట్టుకుంది. ఇకపోతే ఇప్పుడిప్పుడే సమంత(Samantha) మయోసైటిస్ అనే వ్యాధి నుంచి కోలుకుంటోంది. తనకు ఎవరి సాయం లేకున్నా ఒంటిరిగా పోరాడుతూ సినిమాల్లోనే కాదు నిజజీవితంలోనూ సక్సెస్ అని నిరూపించుకుంటోంది. మయోసైటిస్ వ్యాధి కారణంగా గతకొన్ని నెలలుగా షూటింగ్లకు సమంత బ్రేక్ ఇచ్చింది.
కొన్ని రోజుల గ్యాప్ తర్వాత సమంత(Samantha) ఇటీవలే కెమెరా ముందుకొచ్చింది. తాజాగా తమిళనాడులోని దిండిక్కల్ జిల్లాలోని పళని సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో సమంత ప్రత్యేక పూజలు చేపట్టింది. ఈ సందర్భంగా కొండ కింది నుంచి పైవరకు మెట్టు మెట్టుకు హారతి వెలిగించి తన మొక్కును చెల్లించుకుంది. తాను అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకోవాలని పూజలు జరిపించినట్లు సమాచారం. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
https://twitter.com/i/status/1624070741892161538
ఇకపోతే సమంత(Samantha)తో ఇటీవలే ది ఫ్యామిలీ మ్యాన్ తెరకెక్కించిన రాజ్ అండ్ డీకేతో సిటాడెల్ వెబ్ సిరీస్ చేస్తోంది. ఈ మధ్యనే ఆ షూటింగ్లో కూడా సామ్ జాయిన్ అయింది. త్వరలోనే విజయ్ దేవరకొండతో నటిస్తున్న ఖుషీ సినిమా షూటింగ్లో కూడా అడుగుపెట్టనున్నట్లు తెలుస్తుంది. సమంత(Samantha) నటించిన శాకుంతలం ఇటీవలే రిలీజ్ డేట్ను వాయిదా వేసింది. మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 17న రావాల్సిన శాకుంతలం ఏప్రిల్ 14కు వాయిదా పడినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.