పవర్ స్టార్.. రెబల్ స్టార్ కలిస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకుమించి అనేలా ఉంటుంది. పై అప్ కమింగ్ ప్రాజెక్ట్‌తో పాన్ ఇండియా మార్కెట్లోకి అడుగు పెట్టబోతున్నారు పవన్(Pawan kalyan).. ఇప్పటికే బాహుబలితో పాన్ ఇండియా స్టార్డమ్ అందుకున్నాడు ప్రభాస్(Prabhas). అలాంటి ఈ ఇద్దరు ఒక చోట కలిస్తే.. ఆ సందడి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ప్రస్తుతం అదే జరుగుతున్నట్టు తెలుస్తోంది.
పవన్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న’హరిహర వీరలమల్లు’.. ఇటీవలె తిరిగి సెట్స్ పైకి వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. గుర్రాలతో పాటు సాగే ఓ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక దీని పక్కనే ప్రభాస్ నటిస్తున్న సలార్ మూవీ షూటింగ్ కూడా జరుగుగోతోందట. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్.. ఇప్పటికే చాలాభాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. రీసెంట్‌గానే రామోజీ ఫిలిం సిటీలో కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేశారు. ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా నిర్మించిన బస్తీ సెట్లో ఈ షూటింగ్ చేస్తున్నారట.
ప్రభాస్‌తో పాటు ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ఇలా సలార్, హరిహర వీరమల్లు షూటింగ్ పక్క పక్కనే జరుగుతుండడంతో.. రామోజీ ఫిల్మ్ సిటీ కళకళలాడిపోతోందట. ఇక హరిహర వీరమల్లును వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్‌కు ప్లాన్ చేస్తుండగా.. సలార్‌ను 2023 సెప్టెంబర్ 28 రిలీజ్ చేయబోతున్నారు. ఏదేమైనా.. సలార్, హరిహర వీరమల్లు షూటింగ్ ఒకే చోట జరుగుతుండడంతో.. పవర్ స్టార్, రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.