Shocking కామెంట్స్.. కేరళ కుట్టిని వేధించిన స్టార్ హీరో?
తెలుగులో చివరగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన 'భీమ్లానాయక్'లో నటించింది నిత్య మీనన్. ఆ తర్వాత ధనుష్ నటించిన 'తిరు' అనే డబ్బింగ్ చిత్రంతో ఆడియెన్స్‌ను పలకరించింది. ఇప్పుడు ఓ వెబ్ సిరీస్‌తో రాబోతోంది. నిత్య మీనన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Nitya Menon: మళయాళీ ముద్దుగుమ్మ నిత్యా మీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కెరీర్ స్టార్టింగ్ నుంచి కథా బలమున్న చిత్రాల్లో నటిస్తూ.. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. పెళ్లి విషయంలో నిత్య గురించి ఏదో ఒక పుకారు వినిపిస్తునే ఉంది. ప్రస్తుతం కొన్ని సినిమాలతోపాటు వెబ్ సిరీస్‌లలో కూడా నటిస్తోంది. ఆ మధ్య నిత్య సినిమాల విషయాల కంటే పర్సనల్ లైఫ్ పరంగా ఎక్కువగా వార్తల్లో నిలిచింది. నిత్య పెళ్లి, ఫలానా హీరోతో డేటింగ్ అంటూ జోరుగా ప్రచారం జరిగింది. ఓ మలయాళ హీరోను పెళ్లి చేసుకోబోతుందని కూడా వినిపించింది. ఇప్పుడు నిత్యనే స్వయంగా ఓ స్టార్ హీరో తనని వేధించాడని చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది.
నిత్య మీనన్ నటించిన ‘కుమారి శ్రీమతి’ అనే వెబ్ సిరీస్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. గోమతేష్ ఉపాధ్యాయే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్ సెప్టెంబర్ 28 నుంచి అమెజాన్‌లో స్ట్రీమింగ్ కానుంది. స్వప్న సినిమాస్ బ్యానర్ పై స్వప్న దత్ నిర్మించింది. ఈ సిరీస్ నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన నిత్య.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసింది.
‘ఓ కోలీవుడ్ స్టార్ హీరో నన్ను వేధించాడు.. తమిళ్ ఇండస్ట్రీ వల్ల నేను చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాను’ అని చెప్పింది. దీంతో నిత్యను వేధించిన ఆ స్టార్ హీరో ఎవరు? అంటూ ఆరా తీసే పనిలో ఉంది సోషల్ మీడియా వర్గం. మరి నిత్యను వేధించింది ఎవరో ఆమెకే తెలియాలి.