కన్నడ హాట్ బ్యూటీ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే మంచి స్టార్ డమ్ అందుకుంది. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్డమ్ అనుభవిస్తోంది. పుష్ప సినిమాతో వచ్చిన క్రేజ్‌ను క్యాష్ చేసునేందుకు.. భారీ సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం హిందీ కొన్ని సినిమాలతో పాటు.. తెలుగు, తమిళ్లో పుష్ప2, వారసుడు సినిమాలు చేస్తోంది. అలాగే ఇంకొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి. ఇక సినిమాలతో పాటు సోషల్ మీడియాలోను ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటుంది రష్మిక. ఈ మధ్యే ఉన్నట్టుండి తన పై వస్తున్న ట్రోలింగ్ పై పెద్ద పోస్ట్ పెట్టింది ఈ అమ్మడు. తనపై అనవసరంగా ట్రోల్స్ చేస్తున్నారని.. కాస్త కోపంగా.. ఎమోషనల్ పోస్ట్ చేసింది.
ఇక ఇప్పుడు వర్కౌట్‌కు సంబంధించిన ఓ ఫోటోని షేర్ చేస్తూ.. మెడికేషన్ గురించి చెప్పుకొచ్చింది. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా.. ఎక్స్‌ర్‌సైజ్ చేయడం కంటే మరో బెటర్ ఆప్షన్ లేదని చెప్పుకొచ్చింది. ‘బాధలో ఉన్నప్పుడు, కోపంగా ఉన్నప్పుడు.. సంతోషంలోనూ, దుఃఖంలోనూ.. ప్రశాంతతలోనూ, ప్రపంచంలో ఉన్నత శిఖరాలను అధిరోహించినప్పుడు.. ఎలా ఉన్నా, ఎక్కడున్నా వర్కవుట్ చేయండి.. వర్కవుట్ చేసిన తర్వాత ఎంతో హాయిగా ఉంటుంది.. ఒకవేళ ఎవరైనా వర్కవుట్ చేయకపోతే ట్రై చేయండి’ అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది రష్మిక. దాంతో మళ్లీ అమ్మడికి ఏమైందని.. ఉన్నట్టుండి ఎందుకు ఫిలాసఫీలు చెబుతోందని అంటున్నారు నెటిజన్స్. మొత్తంగా ఈ మధ్య రష్మిక ఏదో విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతునే ఉంది.