Nassar: విలక్షణ నటుడు, సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నాజర్(Nassar) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. నాజర్ తండ్రి మెహబూబ్ బాషా(Mehboob Basha) మరణించారు. 95 ఏళ్ల మెహబూబ్ బాషా కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తుండగానే..తమిళనాడులోని చెంగల్పట్టులో తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. మెహబూబ్ బాషా మృతి విషయాన్ని నాజర్ కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు. పితృ వియోగంతో బాధపడుతున్న నాజర్ కు బంధుమిత్రులు, సినిమా మిత్రులు, వ్యాపార, రాజకీయ ప్రముఖులు సానుభూతి తెలుపుతున్నారు. మెహబూబ్ బాషా అంత్యక్రియలు చెంగల్పట్టులో రేపు నిర్వహించనున్నారు.