సమంత(samantha) ఏం చేసినా సంచలనమే. సోషల్ మీడియాలో అమ్మడు జస్ట్ అలా ఏదైనా పోస్ట్ చేస్తే.. క్షణాల్లో వైరల్‌గా మారుతుంది. ఇప్పటికీ సమంత స్టార్ హీరోయిన్ స్టాటస్‌ను అనుభవిస్తోంది. అందుకే ఆమె రెమ్యూనరేషన్ కూడా ఓ రేంజ్లో ఉంటుంది. కానీ ఖుషి సినిమా కోసం సామ్ పారితోషికం తగ్గినట్టు తెలుస్తోంది.
యశోద సినిమా రిలీజ్ సమయంలో సమంత(samantha) చేసిన ట్వీట్ మాత్రం.. ఇప్పటికీ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తునే ఉంది. తాను మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో పడుతున్నానని చెప్పి అందరిరీ షాక్ ఇచ్చింది. ఈ మధ్యే అమ్మడు మళ్లీ అమెరికాకు ట్రీట్‌మేంట్ కోసం వెళ్లిపోయింది. అక్కడ ఖుషి ప్రమోషన్స్ కూడా చేస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన సెప్టెంబర్ 1న రిలీజ్‌కు రెడీ అవుతోంది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలోనే సామ్ అనారోగ్యం బారిన పడింది. సమంత వల్లే ఖుషి షూటింగ్ డిలే అయింది. లేదంటే పోయిన డిసెంబర్లోనే ఖుషి సినిమా రిలీజ్ అయి ఉండేది. అందుకే ఈ సినిమా పారితోషికం తగ్గినట్టు(reduced) తెలుస్తోంది.
మామూలుగా అయితే ఫ్యామిలీ మ్యాన్ 2(family man season 2) సిరీస్ తర్వాత సమంత రెమ్యూనరేషన్ భారీగా పెరిగిపోయింది. ఒక్కో సినిమాకు దాదాపు 4, 5 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటోంది. ఖుషి కోసం ఎంత చార్జ్ చేసిందో తెలియదు గానీ.. ఆమెక ఇవ్వాల్సిన దాంట్లో కోటి రూపాయలు తగ్గించినట్టు టాక్ నడుస్తోంది. అమ్మడి వల్ల షూటింగ్ డిలే అయినందుకే ఈ కోత అంటున్నారు. ఇకపోతే.. మయోసైటిస్ కారణంగా.. ఖుషి, సిటాడెల్ షూటింగ్స్ మాత్రమే కంప్లీట్ చేసింది సామ్. మిగతా ప్రాజెక్ట్స్ కోసం తీసుకున్న అడ్వాన్స్‌ను తిరిగి ఇచ్చేసింది. ప్రస్తుతం మయోసైటిస్ నుంచి కోలుకోవడానికి సినిమాలకు ఏడాది పాటు గ్యాప్ ఇచ్చింది. తిరిగి 2024లో సామ్ రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. కానీ చివరగా శాకుంతలం డిజాస్టర్ అవడంతో ‘ఖుషి’ సినిమా పై భారీ ఆశలు పెట్టుకుంది సమంత. విజయ్ దేవరకొండ కూడా ఈ సినిమా పై భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఇప్పటికే విడుదలైన ‘ఖుషి’ పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి ఖుషి రిజల్ట్ సమంతను ఖుషీ చేస్తుందేమో చూడాలి.