అసలే లైగర్ ఫ్లాప్‌తో డీలా పడిపోయాడు విజయ్ దేవరకొండ(Vijay Deverakonda). అలాంటిది ఇప్పుడు సమంత(Samantha) వల్ల మరింత టెన్షన్ పడుతున్నాడట రౌడీ. సామ్ మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నానని చెప్పడంతో.. అభిమానుల్లో ఆందోళన మొదలైన సంగతి తెలిసిందే. సమంతకు ఏమైంది.. ఎందుకలా అయింది.. అని టెన్షన్ పడుతున్నారు. ఈ జాబితాలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా ఉన్నాడు. సమంత త్వరగా కోలుకోవాలని రౌడీ కూడా కోరుకుంటున్నాడు. కానీ సమంత ప్రస్తుత పరిస్థితులు చూసి.. ఇంకాస్త ఎక్కువగా టెన్షన్ పడుతున్నాడట రౌడీ. ఈ ఇద్దరు కలిసి ఖుషి అనే సినిమాలో నటిస్తున్నారు.
లైగర్ తర్వాత విజయ్ నుంచి వస్తున్న సినిమా ఇదే. అందుకే ఖుషి పై భారీ ఆశలు పెట్టుకున్నాడు రౌడీ. అందుకు డిసెంబర్ 23న ‘ఖుషి’ రిలీజ్ చేయాలనుకున్నాడు. కానీ ఈ సినిమా షూటింగ్ మాత్రం ఇంకా కంప్లీట్ అవలేదు. ఇప్పుడు సమంత ఉన్న స్థితిలో షూటింగ్లో జాయిన్ అయ్యే అవకాశాలు తక్కువ. దాంతో కొన్ని రోజులు ఈ సినిమా షూటింగ్ బ్రేక్ తప్పదని అంటున్నారు. అందుకే ఖుషి వాయిదా పడడం ఖాయమంటున్నారు. ఈ నేపథ్యంలో.. విజయ్ కొత్త ప్రాజెక్ట్ మొదలు పెట్టాలనే ఆలోచనలో ఉన్నాడట.
ఇప్పటికే జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరికి రౌడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడా సినిమాను కాస్త ముందుగానే పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడట. సమంత తిరిగి ఖుషి షూటింగ్లో జాయన్ అయ్యేలోపు.. గౌతమ్ సినిమాకు సంబంధించిన ఒక షెడ్యూల్ కంప్లీట్ చేయాలని అనుకుంటున్నారట. ఆ తర్వాత రెండు సినిమాలను పారలల్‌గా షూటింగ్ ప్లాన్ చేయనున్నాడట. దిల్ రాజు విజయ్ కొత్త సినిమాను నిర్మించబోతున్నట్టు తెలుస్తోంది. త్వరలో దీనిపై క్లారిటీ రానుందని టాక్.