»Samantha A Bumper Offer For Samantha Romance With A Star Hero
Samantha: సమంతకు బంపర్ ఆఫర్? స్టార్ హీరోతో రొమాన్స్?
ఇక సమంతకు అవకాశాలు రావా? అనే వార్తలకు ఫుల్ స్టాప్ పడినట్టేనని ఆమె అభిమానులు చెబుతున్నారు. కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉన్న సామ్‌కు ఇప్పుడో బంపర్ ఆఫర్ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇంతకా ఎవరితో ఛాన్స్ అందుకుంది.
Samantha: ఉన్నట్టుండి మయో సైటిస్ అని చెప్పి షాక్ ఇచ్చింది సమంత. బెడ్ పై నుంచే యశోద సినిమాకు డబ్బింగ్ చెప్పింది. అప్పటి నుంచి సమంత హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేజ్ చేస్తునే ఉంది. మయోసైటిస్ నుంచి ఇప్పట్లో కోలుకుంటుందా? అని ఆమె అభిమానులు కాస్త టెన్షన్ పడ్డారు. దానికితోడు ఖుషి సినిమా తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది అమ్మడు. తీసుకున్న అడ్వాన్స్ కూడా తిరిగి ఇచ్చేసింది. మయో సైటిస్ ట్రీట్మెంట్ కోసం విదేశాలు తిరిగింది. పలు వెకేషన్స్ కూడా ఎంజాయ్ చేసింది. అయితే.. ఇప్పుడు సమంత పూర్తిగా కోలుకున్నట్టే.
ఎందుకంటే.. ఈ మధ్య సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండడంతో పాటు.. తాను సూపర్‌గా ఉన్నానని చెబుతు వస్తోంది. కానీ సమంత చేతిలో ఒక్క ప్రాజెక్ట్ కూడా లేదు. అసలు సమంతకు ఆఫర్లు రావడం లేదనే ప్రచారం జరిగింది. కానీ ఫైనల్‌గా సామ్‌కు బంపర్ ఆఫర్ వచ్చినట్టుగా తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్‌తో నటించే ఛాన్స్ వచ్చినట్టుగా చెబుతున్నారు. గతంలో విజయ్‌తో కలిసి తేరీ వంటి సినిమాల్లో నటించింది సామ్. ఆ సినిమాలన్నీ సూపర్ హిట్‌గా నిలిచాయి.
ప్రస్తుతం గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం అనే సినిమాలో నటిస్తున్నాడు విజయ్. ఈ సినిమా తర్వాత ఒకటి రెండు ప్రాజెక్ట్స్ చేసి రాజకీయాలకే పరిమితమవ్వాలని భావిస్తున్నాడు. ఈ క్రమంలో మరోసారి అట్లీతో సినిమా చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో సమంతను హీరోయిన్గా అనుకుంటున్నారట. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానుందని అంటున్నారు. ఏదేమైనా.. ఇక పై సమంత మాత్రం తగ్గేదేలే అన్నమాట.