»Salman Who Wants To Be A Father Doesnt Want To Get Married
Salman Khan : తండ్రి అవ్వాలనుకుంటోన్న సల్మాన్..పెళ్లి వద్దంట !
సల్మాన్ ఖాన్(Salman Khan) ఏనాడూ ప్రేమ, పెళ్లి గురించి మాట్లాడలేదు. అయితే ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో సల్మాన్ ఖాన్ తన జీవితంలోని ముఖ్య విషయం గురించి తెలిపాడు. ప్రస్తుతం ఆ విషయాలే ఫిల్మ్ సర్కిల్లో వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్(Bollywood) హీరోల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా సల్మాన్ ఖాన్(Salman Khan) ఇంకా కొనసాగుతున్నాడు. పాన్ ఇండియా(Pan India) స్థాయిలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సల్మాన్ ఖాన్ తాజాగా ఓ పోస్టును షేర్ చేశారు. సినిమాల అప్డేట్ కంటే తన వ్యక్తిగత విషయాలను సల్మాన్ ఎక్కువగా చెప్పుకోడు. అయితే సోషల్ మీడియా(Social Media)లో మాత్రం ఆయన వ్యక్తిగత జీవితం గురించి చర్చ నడుస్తూ ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్లతో సల్లుభాయ్ డేటింగ్ వార్తలు నెట్టింట తెగ వైరల్(Viral) అవుతుంటాయి.
సల్మాన్ ఖాన్(Salman Khan) ఏనాడూ ప్రేమ, పెళ్లి గురించి మాట్లాడలేదు. అయితే ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో సల్మాన్ ఖాన్ తన జీవితంలోని ముఖ్య విషయం గురించి తెలిపాడు. ప్రస్తుతం ఆ విషయాలే ఫిల్మ్ సర్కిల్లో వైరల్ అవుతున్నాయి. తాను ప్రేమ విషయంలో దురదృష్టవంతుడినని, తనను జాన్ అని పిలవాలనుకున్న అమ్మాయి ఇప్పుడు భాయ్ అంటోందని తెలిపాడు. ఈ విషయాలే కాకుండా పెళ్లి, పిల్లల గురించి కూడా సల్మాన్ తన మనసులోని మాటను బయటపెట్టాడు.
తన ఇంటికి కోడలిని కాకుండా పిల్లలను తీసుకోవాలనుకుంటున్నట్లు సల్మాన్ ఖాన్(Salman Khan) తెలిపాడు. ఓ పాపను దత్తత తీసుకుని పెంచుకోవాలనుకుంటున్నానని, అయితే భారతీయ చట్టాలు అందుకు ఒప్పుకుంటాయో లేదో చూడాలని సల్మాన్ కాన్ చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పటికీ తనకు పెళ్లంటే అస్సలు ఇష్టం లేదని సల్లుభాయ్ తెలిపాడు. ఆయన చెప్పిన విషయాలు ఇప్పుడు నెట్టింట వైరల్(Viral) అవుతున్నాయి.