Salaar రిలీజ్ డేట్ ఫిక్స్.. మరి వీళ్ల పరిస్థితేంటి?
ఎట్టకేలకు సలార్ రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చేసింది. మేకర్స్ అఫిషీయల్‌గా అనౌన్స్ చేయకపోయినా.. ప్రశాంత్ నీల్ సోల్‌మేట్ సలార్ డేట్‌ను లాక్ చేసినట్టుగా హింట్ ఇచ్చేసింది. దీంతో మిగతా సినిమాల పరిస్థితేంటి? అనేదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
Prabhas: ప్రస్తుతం సలార్ రిలీజ్ డేట్ మిగతా సినిమాలను తెగ డిస్టర్బ్ చేస్తోంది. ముందుగా సెప్టెంబర్ 28న సోలోగా సలార్‌కు బాక్సాఫీస్‌ను రాసిచ్చేశారు మూవీ మేకర్స్. ఊహించని విధంగా సలార్ పోస్ట్‌పోన్ అయి.. అందరికీ షాక్ ఇచ్చింది. దీంతో ఇప్పటికే డేట్ లాక్ చేసుకున్న సినిమాలు మళ్లీ డైలామాలో పడిపోయాయి. ప్రస్తుతం సలార్ డిసెంబర్ 22న రానుందనే టాక్ నడుస్తోంది. ప్రశాంత్ నీల్ భార్య లిఖితా రెడ్డి, ‘డిసెంబర్ మాములుగా ఉండదు, వెయిట్ చేయలేకపోతున్నాను’ అంటూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక పోస్ట్ పెట్టారు. దీంతో.. అది సలార్ రిలీజ్ డేట్ కోసమే అని అంతా ఫిక్స్ అయిపోయారు.
ఇదే నిజమైతే.. ఆ రోజు రావల్సిన సినిమాల పరిస్థితేంటి? అనేదే ఇప్పుడు ఎటు తేల్చుకోలేకపోతున్నారు. షారుఖ్ ఖాన్ ‘డంకీ’ విషయాన్ని పక్కకు పెడితే.. ఇప్పటికే నాలుగు తెలుగు సినిమాలు క్రిస్మస్ను టార్గెట్ చేసుకున్నాయి. నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న ‘హాయ్ నాన్న’ డిసెంబర్ 21న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. వెంకటేష్ ‘సైంధవ్’, సుధీర్ బాబు ‘హరోం హర’ సినిమాలు కూడా డిసెంబర్ 22 డేట్ లాక్ చేసుకున్నాయి. నితిన్ ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ను డిసెంబర్ 23న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు సడెన్‌గా సలార్ డిసెంబర్ 22న వస్తుందని అంటున్నారు.
ప్రభాస్ సినిమా రిలీజ్ అయితే.. ఎవ్వరైనా సైడ్ ఇవ్వాల్సిందే. కాబట్టి డైనోసర్ దెబ్బకు.. ఈ సినిమాలు ముందుకో, వెనక్కో వెళ్ళాల్సి ఉంటుంది. లేదు తగ్గేదేలే.. అంటే మాత్రం సలార్ సునామిలో కొట్టుకుపోవడం గ్యారెంటీ. సలార్‌కు పోటీగా డిసెంబర్ 20న హాలీవుడ్ సినిమా ‘ఆక్వా మ్యాన్’ రిలీజ్ ఉంది. ఇండియాలో ఈ సినిమా ఎఫెక్ట్ పెద్దగా లేకపోయినా.. ఓవర్సీస్లో మాత్రం సలార్‌కు గట్టి పోటీ తప్పదు. అలాగే షారుఖ్ ఖాన్ ‘డంకీ’తో గట్టి పోటీ ఉండనుంది.