గతేడాది డిసెంబర్లో రిలీజ్ అయి సంచలనంగా నిలిచంది పుష్ప మూవీ. దాంతో పుష్ప2ని గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్. అందుకోసం స్టార్ క్యాస్టింగ్‌ను రంగంలోకి దింపనున్నాడు. ఈ నేపథ్యంలో లేడీ పవర్ స్టార్ కూడా ఇందులో నటించబోతుందనే న్యూస్ వైరల్‌గా మారింది. అల్లు అర్జున్, రష్మిక మందన్నా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో.. కొత్త నటీ నటులు దర్శనమివ్వబోతున్నారు. ఇటీవలే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైన ఈ హిట్ సీక్వెల్.. అతి త్వరలో రెగ్యూలర్ షూట్ జరుపుకోవడానికి రెడీ అవుతోంది. ఇక ఈ చిత్రాన్ని దాదాపు 350 కోట్ల బట్జెట్‌తో తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తోంది. అలాగే ప్రముఖ బాలీవుడ్ స్టార్స్‌ను తీసుకోబోతున్నట్టు టాక్.
ఇక ఇప్పుడు లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి కూడా కీలక పాత్రలో నటించనుందని తెలుస్తోంది. అంతేకాదు ఇందులో సాయి పల్లవి రోల్ ఇదేనంటూ ఓ న్యూస్ హల్ చల్ చేస్తోంది. సాయి పల్లవి పాత్ర దాదాపు పది నిముషాలు ఉంటుందని.. అది కూడా సెకండాఫ్‌లో గిరిజన యువతిగా కనిపించనుందని ప్రచారం జరుగుతోంది. అలాగే బన్నీతో ఓ పాట కూడా ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే పుష్ప టీమ్ సాయి పల్లవిని సంప్రదించినట్టు.. అందుకు అమ్మడు ఓకే చెప్పిందని టాక్. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందనేది తెలియాల్సి ఉంది. గతంలో ఓ ఈవెంట్లో సాయి పల్లవికి లేడి పవర్ స్టార్ అని బిరుదు ఇచ్చింది సుకుమారే. దాంతో ఈ కాంబో ఆసక్తికరంగా మారింది. ఇక శేషాచలం అడవుల్లోని ఎర్రచందనం బ్యాక్ డ్రాప్లో రూపొందిన పుష్ప సినిమాలో.. బన్నీ పర్ఫార్మెన్స్ హైలెట్‌గా నిలిచింది. దాంతో పుష్ప2 కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు సినీ అభిమానులు.