గత వారం, పది రోజులుగా ఎక్కడ చూసిన సమంత గురించే చర్చ జరుగుతోంది.. యశోద సినిమా రిలీజ్‌తో పాటు మయో సైటిస్ కారణంగా వార్తల్లో నిలుస్తునే ఉంది సామ్. దాంతో సమంతకు ‘యశోద’ సినిమా రిజల్ట్ ఎంతో కీలకంగా మారింది.. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత.. సమంత నుంచి వచ్చిన ఫుల్ లెంగ్త్ మూవీ ఇదే. మధ్యలో కోలీవుడ్ మూవీ ‘కన్మణి రాంబో ఖతీజా’లో నయన తారతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇక అంతకు ముందు పుష్ప మూవీలో చేసిన ఐటెం సాంగ్‌తో దుమ్ముదులిపింది.
దాంతో యశోద సినిమా సమంతకు ఎంతో స్పెషల్ కానుంది. పైగా సామ్ చేసిన ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కూడా ఇదే. అంతేకాదు ప్రస్తుతం మయోసైటిస్ అనే వ్యాధితో పోరాడుతోంది సమంత. అందుకే యశోద పై సింపథితో పాటు అందరిలోను ఆసక్తి నెలకొంది. హరి, హరీష్ దర్శకులుగా పరిచయం అయినా ఈ సినిమా.. నవంబర్ 11న థియేటర్లోకి వచ్చేసింది. ఇక పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు వస్తుండడంతో.. సమంత ఎమోషనల్ పోస్టులు.. ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఉదయాన్నే మీరే నా కుటుంబం అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది సమంత. అందుకు తగ్గట్టే.. ఫస్టో షో నుంచే యశోద పై పాజిటివ్ ట్వీట్లు చేస్తున్నారు ఫ్యాన్స్. ఎమోషనల్ థ్రిల్లర్ అని, సమంత నటన అద్భుతమని, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగుందని.. ఇలా రకరకాలుగా యశోదపై పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. దాంతో ట్విట్టర్ వేదికగా వారందరికీ రిప్లే ఇస్తు..
ఎమోషనల్‌గా థ్యాంక్యూ చెబుతోంది సమంత. ప్రస్తుతం సోషల్ మీడియాలో సమంత పేరు మార్మోగిపోతోంది.. హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్ అంటూ.. సామ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. మొత్తంగా సమంత మంచి హిట్‌తో పాటు పాన్ ఇండియా స్టార్డమ్ అందుకుందని చెప్పొచ్చు.