»Rashmika Mandanna Rashmikas Frolicking On The Beach
Rashmika Mandanna: బీచ్‌లో సెగలు రేపిన రష్మిక!
నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయాన్గా ఓ రేంజ్లో దూసుకుపోతోంది అమ్మడు. తాజాగా ఈ హాట్ బ్యూటీ గ్లామర్ ట్రీట్‌కు బీచ్‌లో సెగలు రేగుతున్నాయి.
Rashmika Mandanna: Rashmika's frolicking on the beach!
Rashmika Mandanna: చలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ రష్మిక మందన్న.. మొదటి సినిమాతోనే తెలుగు కుర్రాళ్లకు ఫేవరేట్‌గా మారిపోయింది. ఇక అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమాతో నేషనల్ వైడ్‌గా పాపులర్ అయ్యింది. అదే క్రేజ్‌తో బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన అనిమల్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది.
యానిమల్ క్రేజ్‌తో ఇప్పుడు ఏకంగా సల్మాన్ ఖాన్‌తో నటించే ఛాన్స్ కొట్టేసింది అమ్మడు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందబోయే సికందర్ సినిమాలో హీరోయిన్గా రష్మిక ఆఫర్ అందుకుంది. అలాగే పుష్ప2తో మరోసారి పాన్ ఇండియా లెవల్లో ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. ఆగష్టు 15న పుష్ప2 రిలీజ్ కానుంది. ఈ సినిమాలతో పాటు ది గర్ల్ ఫ్రెండ్, రెయిన్బో, కుబేర సినిమాల్లో నటిస్తోంది. ఇంకొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి. అలాగే విజయ్ దేవరకొండతో మరోసారి రొమాన్స్ చేయడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది.
ఇక సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా అమ్మడు తగ్గేదేలే అంటుంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసే రష్మిక.. తాజాగా బీచ్‌లో అందాల విందు చేసింది. అలా బీచ్‌లో సముద్రపు ఒడ్డున బికినీలో కూడా మెరిసింది. అమ్మడి అందానికి ఫిదా అవుతున్నారు కుర్రాళ్లు. రష్మిక గ్లామర్ ట్రీట్‌కు సోషల్ మీడియా షేక్ అయిపోయింది. ప్రస్తుతం ఆ ఫోటోలను తెగ వైరల్ చేస్తున్నారు ఆమె ఫ్యాన్స్.