ఈ మధ్య కాలంలో సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లు కూడా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు స్టార్ హీరోలు. ఇప్పటికే పలువురు స్టార్స్ ఓటిటి ఎంట్రీ ఇవ్వగా.. ఇప్పుడు ఎనర్జిటిక్ యంగ్ హీరో రామ్ పోతినేని కూడా రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది.
Ram Pothineni: ప్రస్తుతం స్టార్ హీరోలంగా ఓటిటి బాట పడుతున్నారు. ఇప్పటికే తెలుగులో రానా నాయుడు వెబ్ సిరీస్ చేసి సంచలనం సృష్టించారు బాబాయ్, అబ్బాయ్ వెంకటేష్, రానా. అలాగే.. అక్కినేని నాగ చైతన్య కూడా ‘ధూత’ అనే వెబ్ సిరీస్ చేసి హిట్ కొట్టాడు. ఇదే దారిలో వెళ్లడానికి ఇంకొంతమంది టాలీవుడ్ స్టార్స్ రెడీ అవుతున్నారు. ఇప్పుడు ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని కూడా డిజిటల్ ఎంట్రీకి ప్లానింగ్ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. రానా నాయుడు తరహాలో నెట్ ఫ్లిక్స్ రామ్‌తో ఒక భారీ బడ్జెట్ వెబ్ సిరీస్‌కు రంగం సిద్ధం చేస్తున్నట్టుగా సమాచారం. ఇప్పటికే.. ఇద్దరు ముగ్గురు దర్శకులను లైన్లో పెట్టి.. రామ్ దగ్గరికి పంపినట్టుగా చెబుతున్నారు.
రామ్ కూడా కథ నచ్చితే వెబ్ సిరీస్ చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పినట్టుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ విషయంలో.. రామ్ సైడ్ నుంచి ఇంకా డెసిషన్ పెండింగ్‌లో ఉందని అంటున్నారు. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది. ఇకపోతే.. ప్రస్తుతం పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న డబుల్ ఇస్మార్ట్ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు రామ్. ఈ మధ్య కాస్త గ్యాప్ తీసుకొని రీసెంట్గా షూటింగ్ స్టార్ట్ చేయగా.. ముంబైలో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. మే 15న ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే మణిశర్మ సూపర్ ట్యూన్స్ రెడీ చేసినట్టుగా తెలుస్తోంది. ఎలాగైన సరే.. డబుల్ ఇస్మార్ట్‌తో రామ్, పూరి సాలిడ్ హిట్ కొట్టాలనే కసితో ఉన్నారు. మరి డబుల్ ఇస్మార్ట్ ఏం చేస్తుందో చూడాలి.