ఇండస్ట్రీలో ఓ హీరో కథను మరో హీరో చేయడం కామన్. అప్పటి పరిస్థితులను బట్టి.. కొంతమంది హీరోలో తమ దగ్గరకొచ్చిన కథలను రిజెక్ట్ చేస్తే.. మరికొంతమంది ఇది మరో హీరోకు సూట్ అవుతుందని సజెస్ట్ చేస్తుంటారు. అలాగే అప్పటికే ఉన్న కమిట్మెంట్స్ వల్ల కొంత కాలం వెయిట్ చేయమని దర్శకులకు చెబుతుంటారు. కానీ ఈ లోపు హీరోలు మారిపోతారు.
ఇప్పుడు బన్నీ, బోయపాటి విషయంలోను ఇదే జరిగిందని తెలుస్తోంది. ప్రస్తుతం హీరో రామ్‌తో యాక్షన్ మూవీ చేస్తున్నాడు బోయపాటి శ్రీను. ఇప్పటికే సెట్స్ పైకి వెళ్లిన ఈ సినిమా.. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్లో షూటింగ్ జరుగుతోంది. అయితే తాజాగా ఈ సినిమా కథతో ముందుగా బన్నీతో చేయాలనుకున్నాడట బోయపాటి. గతంలో అల్లు అర్జున్-బోయపాటి కాంబినేషన్లో వచ్చిన ‘సరైనోడు’ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. దాంతో ఈ కాంబోలో మరో సినిమాకు ప్లాన్ చేశారు.
బన్నీ-బోయపాటి మధ్య కథా చర్చలు కూడా జరిగాయట. కానీ బన్ని మిగతా కమిట్మెంట్స్తో పాటు.. ఇతర కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ వర్కౌట్ కాలేదట. దాంతో ఇదే కథతో రామ్ సినిమా చేస్తున్నాడని టాక్. ఫైనల్‌గా రామ్‌కు భారీ యాక్షన్ మూవీ పడినట్టేనని అంటున్నారు. ఇటీవల వచ్చిన రామ్ ‘ది వారియర్’ డిసప్పాయింట్ చేయడంతో..
బోయపాటి సినిమాతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు రామ్. అది కూడా పాన్ ఇండియా స్టార్డమ్ అందుకోవాలని చూస్తున్నాడు. శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా.. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై తెరకెక్కుతోంది. మరి బన్నీ కోసం అనుకున్న కథలో రామ్‌ను బోయపాటి ఎలా ప్రజెంట్ చేస్తాడో చూడాలి.