బోయపాటి శ్రీను, రామ్ పోతినేని కాంబినేషన్లో.. పాన్ ఇండియా సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి కెరీర్లో భారీ బడ్జెట్‌తో పాటు.. ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కూడా ఇదే. అఖండ తర్వాత బోయపాటి చేస్తున్న సినిమా కావడంతో.. ఎలాంటి సబ్జెక్ట్‌తో రాబోతున్నాడనే ఆసక్తి అందరిలోను ఉంది. అందుకు తగ్గట్టే ఈ సినిమాను భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించబోతున్నాడట బోయపాటి. మామూలుగా బోయపాటి సినిమాల్లో హీరోలు ద్విపాత్రాభినయం చేస్తే.. ఓ పాత్ర నార్మల్‌గా ఉంటే.. మరోటి మాత్రం హై ఓల్టేజ్ పవర్‌లా ఉంటుంది. ఇప్పుడు రామ్ కోసం అలాంటి పవర్ ఫుల్ స్క్రిప్టు రాసుకున్నాడట బోయపాటి. ఇందులో కూడా హీరో డ్యూయెల్ రోల్ చేయనున్నాడని టాక్. ఈ క్రమంలో.. రామ్ డ్యూయెల్ రోల్లో ఓ రోల్ ఇదేనంటూ ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో రామ్ ఒక లేడీస్ కాలేజ్‌లో లెక్చరర్‌గా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఇక కాలేజ్ బ్యాక్ డ్రాప్ అంటే రామ్ ఎంటర్టైనింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పైగా లేడీస్ కాలేజ్ అంటున్నారు కాబట్టి.. ఈ పాత్ర రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఉంటుందని చెప్పొచ్చు. దీంతో రామ్ మరో పాత్ర పవర్ ఫుల్‌గా ఉండడం ఖాయమని అంటున్నారు. ఇక వారియర్ ఫ్లాప్‌తో బోయపాటి పైనే భారీ ఆశలు పెట్టుకున్నాడు రామ్. అందుకే బోయపాటి.. రామ్ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా.. పక్కా ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ ప్లాన్ చేస్తున్నాడని చెప్పొచ్చు. అన్నట్టు ఈ సినిమాలో అఖిల్ ‘ఏజెంట్’ బ్యూటీ సాక్షి వైద్య హీరోయిన్గా ఫైనల్ అయిందని సమాచారం.