Rakul: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఎదిగిన వారిలో రకుల్ ప్రీత్ సింగ్ (Rakul) ఒకరు. టాలీవుడ్ లో అవకాశాలు లేకపోయినా బాలీవుడ్ లో ఛాన్స్ వస్తున్నాయి. కెరటం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో హిట్ కొట్టింది. వెనక్కి తిరిగి చూసింది లేదు. తెలుగులో దాదాపు స్టార్ హీరోలు అందరితోనూ ఆడిపాడింది.
ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో ఎలాంటి ఛాన్స్ లేకపోయినా, సోషల్ మీడియా ద్వారా మాత్రం అభిమానులను అలరిస్తూ ఉంటుంది. రకుల్ కి ఫ్యాషన్ సెన్స్ ఎక్కువ. ఫోటోలు చూస్తే అర్థమౌపోతంది. చాలా డిఫరెంట్ గా కనిపించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. తన లేటెస్ట్ ఫోటో షూట్ లతో ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా వైట్ డ్రెస్ లో మెరిసింది.
వైట్ కలర్ మ్యాక్సీ డ్రెస్ ధరించింది. సోఫాపై కూల్ గా పడుకొని హాట్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. డ్రెస్ చాలా ట్రాన్సరెంట్ గా ఉండటంతో, ఆ మ్యాక్సీ డ్రెస్ లోపలి నుంచి ఇన్నర్స్ కూడా కనిపిస్తుండటం విశేషం. ఆ ఫోటోలు నెటిజన్లను విపరీతంగా అట్రాక్ట్ చేస్తున్నాయి. సన్నజాజి తీగలా మెరిసిపోతున్నావంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
గతేడాది రకుల్ (Rakul) హిందీలో ఐదు చిత్రాలతో అలరిచింది. ఒక్క హిట్ పడినా, ఈ బ్యూటీ బాలీవుడ్ లో సెటిల్ అయిపోయినట్లే అని అందరూ అనుకున్నారు. కానీ పాపం లక్ లేక, అవన్నీ బాక్సాఫీసు దగ్గర బోల్తా పడ్డాయి. దీంతో అక్కడ కూడా అమ్మడి స్పీడ్ కాస్త తగ్గింది. ప్రస్తుతం హిందీలో ఎలాంటి చిత్రాలు లేకపోవడంతో దీంతో మళ్లీ రకుల్ సౌత్ సినిమాల వైపే చూస్తోంది. తెలుగులో ఛాన్స్ రాకపోయినా తమిళంలో మాత్రం అవకాశాలను అందుకుంటోంది. మరోవైపు రకుల్ పెళ్లి చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. వచ్చే ఏడాది పెళ్లి జరిగే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.