ప్రస్తుతం ప్రపంచమంతా తెలుగు సినిమా ఇండస్ట్రీవైపు చూస్తోందంటే దానికి కారణం మరెవరో కాదు.. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. ఆయనకు ఇంత పేరు ఊరికే రాలేదు. ఏదో సినిమాలు చేసేసినంత మాత్రాన రాలేదు. దాని కోసం కఠోరంగా శ్రమించారు. ఆయన విజయం వెనుక ఎన్ని ఓటములు ఉన్నాయో ఆయనకు తప్పితే ఇంకెవరికీ తెలియదు. దర్శకేంధ్రుడు రాఘవేంద్రరావు దగ్గర చాలా ఏళ్ల పాటు రాజమౌళి పని చేసిన విషయం తెలిసిందే. సీరియల్స్ ను డైరెక్ట్ చేయడం ఆ తర్వాత కొన్ని సినిమాల్లోనూ కనిపించారు రాజమౌళి. అలా ఆయన నటించిన ఒక సినిమా మాత్రం అట్టర్ ఫ్లాప్ అయింది. అదే రెయిన్బో మూవీ. ఆ సినిమాలో రాజమౌళి మాత్రమే కాదు.. ప్రముఖ సీనియర్ డైరెక్టర్ కోడి రామకృష్ణ కూడా నటించారు. కానీ.. ఆ సినిమా అంతగా ఆడలేదు. ఆ సినిమా బాక్సాఫీసు వద్ద ఓటమిని చవిచూసింది.
ఆ సినిమాకు డైరెక్టర్ వీఎన్ ఆదిత్య. ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. ఆ సినిమాలో ఒక క్యారెక్టర్ లో నటించారు రాజమౌళి. కానీ.. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. నిజానికి రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్. ఆస్కార్ రేంజ్ వరకు వెళ్లాయి.. ప్రపంచ స్థాయి దిగ్గజ దర్శకుల్లో రాజమౌళి ఒకరు. ప్రస్తుతం తెలుగు సినిమా గురించి ప్రపంచమంతా మాట్లాడుతుందంటే దానికి కారణం రాజమౌళి. అలాంటి రాజమౌళి కెరీర్ లో మచ్చలా ఒక అట్లర్ ఫ్లాప్ మూవీ మిగిలింది. ఆ సినిమాలో హీరోగా రాహుల్, హీరోయిన్ గా సొనాల్ చౌహాన్ నటించారు.