వ్యూహం(vyooham) మూవీ విడుదల ఆపాలని టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్(Natti Kumar) కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషనర్లను కోరారు. ఈ చిత్రం విడుదలైతే శాంతి భద్రతల సమస్య వస్తుందని వ్యాఖ్యలు చేశారు. అయితే ఎందుకు వస్తుందనే విషయాన్ని ఇప్పుడు చుద్దాం.
producer Natti Kumar demand stop the release of the vyuham movie
ఏపీలో జగన్ మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు రాజకీయ అంశాలతో వస్తున్న చిత్రం వ్యూహం(vyooham) విడుదలను ఆపాలని టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్(Natti Kumar) కేంద్ర, రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లు, కేంద్ర హోంశాఖను కోరారు. ఈ చిత్రాన్ని ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో రిలీజ్ చేస్తే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఓ కేసులో అరెస్టై జైలులో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన పాత్ర డూప్ ద్వారా వస్తున్న ఈ చిత్రం విడుదల చేస్తే అల్లర్లు జరిగే అవకాశం ఉందన్నారు. మరోవైపు టీడీపీ కార్యకర్తలు కూడా చంద్రబాబు అరెస్టు విషయంలో ఆగ్రహంతో ఉన్నట్లు చెప్పారు.
దీనికి తోడు తెలంగాణలో వచ్చే నెలలో ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ జనసేన(janasena), టీడీపీ(TDP) పార్టీలు కూడా పోటీ చేస్తున్నాయి. దీంతోపాటు ఎన్నికల కోడ్ కూడా అమల్లో ఉంది. మరోవైపు ఈ మూవీలో పవన్ కల్యాణ్, చంద్రబాబు పాత్రలను తక్కువ చేసి చూపించారని గుర్తు చేశారు. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రం విడుదల వాయిదా వేయాలని కోరారు. ఈ చిత్రం విడుదల చేయడం ద్వారా వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కూడా ప్రభావం ఉంటుందన్నారు.
ఇలాంటి క్రమంలో నవంబర్ 30 తర్వాత ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి పర్మిషన్ ఇవ్వాలని ఎన్నికల కమిషన్లను కోరారు. అంతేకాదు గతంలో కూడా హైకోర్టు ఇచ్చిన ఆర్డర్లను ప్రస్తావించారు. మరోవైపు వైసీపీ(YSRCP), బీఆర్ఎస్(BRS) ప్రభుత్వాలు కావాలనే ఈ చిత్రాన్ని నవంబర్ 10న విడుదల చేయించి లబ్ది పొందాలని చూస్తున్నాయని ఆరోపించారు. ఇలాంటి క్రమంలో సుమోటోగా ఈ అంశాన్ని స్వీకరించి ఈ మూవీ విడుదల ఆపాలని కోరారు.