బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేశాయి. అయినా కూడా ప్రభాస్ ఇమేజ్ ఏ మాత్రం డ్యామేజ్ కాలేదు కదా.. అంతకంతకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతోంది. అసలు బాహుబలి తర్వాత ఒకే ఒక్క హిట్ పడి ఉంటే.. ప్రభాస్ స్టార్ డమ్ నెక్ట్స్ లెవల్‌కు వెళ్లి ఉండేది. కానీ సాహో, రాధే శ్యామ్ సినిమాలు అలరించలేకపోయాయి. అయితే ఏంటి.. రాజు ఎక్కడున్నా రాజే అన్నట్టు.. హిట్, ఫట్టుతో పనిలేకుండా భారీ క్రేజ్ సొంతం చేసుకుంటున్నాడు ప్రభాస్. రాధే శ్యామ్ సినిమా వచ్చి ఆరు నెలలు దాటిపోయింది. ప్రస్తుతం ప్రభాస్ సినిమాల అప్డేట్స్ కూడా ఏమి లేవు.
అయినా కూడా ఈసారి ఆర్మాక్స్ మీడియా సంస్థ మోస్ట్ పాపులర్ హీరోగా.. ప్రభాస్ మొదటి స్థానం దక్కించుకోవడం ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో పాపులారిటీని బట్టి ప్రతినెలా మోస్ట్ పాపులర్ స్టార్స్ జాబితాను విడుదల చేస్తుంటుంది ఆర్మాక్స్ సంస్థ. ఈ క్రమంలో ఆగష్టు నెలలో తెలుగు హీరోల ర్యాంకింగ్స్‌లో ప్రభాస్ ఫస్ట్ ప్లేస్‌లో నిలవగా.. ఆ తర్వాత ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, నాని, విజయ్ దేవరకొండ, చిరంజీవి, రవితేజ టాప్ టెన్‌లో నిలిచారు. ఇప్పటికే కృష్ణంరాజు మరణంతో దుఖంలో ఉన్న ప్రభాస్.. అభిమానులను మరిచిపోకుండా బోజనాలు ఏర్పాటు చేసినట్టు వైరల్ అవుతోంది. ఇక ఇప్పుడు ఈ న్యూస్ వైరల్‌గా మారింది. ఇక హీరోయిన్లలో సమంత టాప్ ప్లేస్‌లో నిలిచింది. అయితే ఈ పాపులారిటీకి సినిమాలతో సంబంధం లేదు. ఏదేమైనా ప్రభాస్ క్రేజ్ వేరే లెవల్ అని చెప్పొచ్చు.