ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అలాగే మరో రెండు ప్రాజెక్ట్స్ లైన్లో ఉన్నాయి. దాంతో మరో రెండు మూడేళ్ల వరకు ప్రభాస్ డైరీ ఫుల్ అయిపోయిందని చెప్పొచ్చు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఆదిపురుష్.. సంక్రాంతికి రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. ఇక సలార్, ప్రాజెక్ట్ కె సెట్స్ పై ఉన్నాయి. ఇవి అయిపోగానే సందీప్ రెడ్డితో కలిసి ‘స్పిరిట్’ అనే సినిమా చేయనున్నారు. ఈ మధ్యలో మారుతితో ఓ ప్రాజెక్ట్ను మొదలుపెట్టనున్నాడు. అలాగే హిందీ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్తోను ప్రభాస్ మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఇక తెలుగులో కొరటాల, త్రివిక్రమ్ వంటి దర్శకులు కూడా లైన్లో ఉన్నారు. ఇలా క్రేజీ లైనప్ ఉన్న ప్రభాస్.. ఇప్పుడు మరో బాలీవుడ్ సినిమాకు ఓకే చెప్పాడనే న్యూస్ వైరల్గా మారింది. ఆదిపురుష్ టీజర్ లాంచ్ ఈవెంట్లో.. ఆ చిత్ర నిర్మాత భూషణ్ కుమార్.. ప్రభాస్తో మరో సినిమా చేయబోతున్నట్లు చెప్పుకొచ్చారు. ఇప్పటికే ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ సినిమాకు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించిన భూషన్ కుమార్.. ఇప్పుడు ‘ఆదిపురుష్’ను దాదాపు 500 కోట్ల బడ్జెట్తో నిర్మించాడు. దాంతో ఈ క్రేజీ కాంబినేషన్లో మరో సినిమా ఫిక్స్ అయిందనే చెప్పొచ్చు. అయితే దర్శకుడు ఎవరనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. మరి నిజంగానే ప్రభాస్ మరో బాలీవుడ్ మూవీకి పచ్చ జెండా ఊపాడా, లేదా అనే క్లారిటీ రావాలంటే.. ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.