ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న భారీ సినిమాల్లో ‘ప్రాజెక్ట్ కె’ కూడా ఒకటి. ‘మహానటి’ వంటి భారీ హిట్ తర్వాత దర్శకుడు నాగ్ అశ్విన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. వైజయంతి బ్యానర్లో ఎక్కడ తగ్గకుండా.. దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతోంది. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్లో టైమ్ ట్రావెల్ కథతో ఈ సినిమా తెరకెక్కుతోందని టాక్. అందుకే ప్రముఖ కార్ల కంపెనీ ‘మహింద్రా’.. టెక్నాలజీ పరంగా ఇందులో భాగస్వామి అయిందంటున్నారు. అలాగే ఇది పాన్ ఇండియా రేంజ్లో కాకుండా.. పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌గా రాబోతోంది. అంతేకాదు ప్రాజెక్ట్ కె అంటే ‘కల్కి’అని ప్రచారంలో ఉంది. దాంతో ప్రాజెక్ట్ కె పై ప్రభాస్ ఫ్యాన్స్ భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా కథ గురించి ఓ సాలిడ్ హింట్ ఇచ్చారు మేకర్స్.
వినాయక చవితి సందర్భంగా ప్రాజెక్ట్ కే గురించి ఓ పోస్ట్ చేశాడు నాగ్ అశ్విన్. ‘ఒకప్పుడు వేద వ్యాసునికి మహా భారతాన్ని రాయడానికి సహాయం చేశావు.. ఇప్పుడు మా భారతానికి కూడా మీ ఆశీర్వాదం కావాలి విఘ్నేశ్వరా.. అంటూ వినాయక చవితి శుభాకాంక్షలు అని తెలిపాడు. అయితే ముందుగా ఈ పోస్ట్ కామన్‌గా అనిపించినా.. ఆ తర్వాత దాన్ని డీ కోడ్ చేసినట్టుగా.. సాలిడ్ న్యూస్ వైరల్ చేస్తున్నారు అభిమానులు. ఈ పోస్ట్‌తో నాగ్ అశ్విన్ ఇండైరెక్ట్‌గా స్టోరీ లైన్ గురించి హింట్ ఇచ్చాడని అంటున్నారు. ప్రాజెక్ట్ కె మహాభారతం ఆధారంగా తెరకెక్కుతోందని.. అందుకే ‘అప్పుడు, ఇప్పుడు’ అంటు పోస్ట్ చేశాడని అంటున్నారు. ఈ క్రమంలో ప్రభాస్ మహాభారత కాలంలోకి వెళ్లి వస్తాడని.. ప్రాజెక్ట్ కె అంటే కర్ణ అనే టాక్ కూడా ఊపందుకుంది. దాంతో ఒక్కసారిగా ప్రాజెక్ట్ కె పై అంచనాలు పెరిగిపోయాయి. ఏదేమైనా ప్రాజెక్ట్ కె ఎలాంటి కథతో రాబోతుందనేది ఆసక్తికరంగా మారింది.