మన స్టార్ హీరోలు ఏం మాట్లాడినా.. ఏ కొత్త సినిమా అప్టేట్ వచ్చినా.. ఏదో ఓ విధంగా ట్విట్టర్లో ట్రోల్స్ చేస్తునే ఉన్నారు నెటిజన్స్. ఇక సినిమా బాగుంటే ఓకే కానీ.. ఏ మాత్రం రిజల్ట్ తేడా కొట్టినా ట్రోల్స్ రాయుళ్లను తట్టుకోవడం కాస్త కష్టమే. ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ సినిమా.. మెగాస్టార్ ‘ఆచార్య’ సినిమాల విషయంలో.. ఈ స్టార్ హీరోలను అప్పట్లో ఓ రేంజ్లో ట్రోల్ చేశారు. ఇక ఇప్పుడు మరోసారి మెగాస్టార్‌ను అదే విధంగా ట్రోల్ చేస్తున్నారు కొందరు. ‘ఆచార్య’ ఫ్లాప్ ప్రస్థావన వచ్చిప్పుడల్లా కొరటాలనో లేక మెగాస్టార్నో టార్గెట్ చేస్తునే ఉన్నారు. ఇప్పటివరకు కొరటాల దీనిపై స్పందించికపోయినా.. మెగాస్టార్ మాత్రం రెస్పాండ్ అయ్యారు. రీసెంట్గా గాడ్ ఫాదర్ ప్రమోషన్లో భాగంగా.. ఆచార్య విషయంలో డైరెక్టర్ చెప్పిందే తాము చేశామని చెప్పుకొచ్చారు చిరు. దాంతో హిట్టయితే ఆ క్రెడిట్ దక్కించుకుంటారని.. కానీ ఫ్లాప్ అయితే మాత్రం దాన్ని దర్శకుడి పై తోసేయడం కరెక్ట్ కాదంటూ.. మిగతా హీరోలతో పోల్చుతూ ట్రోల్ చేస్తున్నారు. ఇక ప్రభాస్ ‘ఆదిపురుష్’ విషయంలోను ఓ రేంజ్లో ట్రోలింగ్ జరుగుతోంది. ఆదిపురుష్ టీజర్ అలా రిలీజ్ అయిందో లేదో.. వెంటనే ట్రోలింగ్ మొదలైపోయింది. ఈ టీజర్ యానిమేషన్ మూవీలా ఉందని.. కార్టూన్ క్యారెక్టర్స్‌గా చూపించినట్టుగా.. ట్విట్లర్లో ‘Disappointed’ అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. కొన్ని యానిమేషన్ సినిమాలతో ఆదిపురుష్‌ను పోలుస్తూ ట్రోల్ చేస్తున్నారు. మొత్తంగా ప్రస్తుతం సోషల్ మీడియాలో చిరు, ప్రభాస్‌లను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు యాంటీ ఫ్యాన్స్.