రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణవార్త.. సినీ పరిశ్రమతో పాటు రాజకీయ ప్రముఖుల్ని తీవ్రంగా కలచివేసింది. ఆదివారం తెల్లవారు జామున హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు కృష్ణంరాజు. ఆయన మరణవార్త సినీ ఇండస్ట్రీని శోకసంద్రంలో ముంచేసింది. దీంతో సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు ఘనంగా నివాళి అర్పించారు. కృష్ణంరాజుతో తమకున్న అనుమంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఇక కృష్ణంరాజుతో ప్రభాస్‌కి ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
కృష్ణంరాజుకి ప్రభాస్ అంటే చెప్పలేనంత ప్రేమ. ప్రభాస్ తన సినీ వారసుడని.. ప్రభాస్ ఎదుగుదలను చూసి ఎంతో మురిసిపోయారు కృష్ణంరాజు. దాంతో ప్రభాస్ తన పెదనాన్న మరణాన్ని తట్టుకోలేకపోయారు. సెలబ్రిటీలు ప్రభాస్‌ను పరామర్శించిన సమయంలో కన్నీటి పర్యంతమయ్యాడు. ప్రభాస్ కన్నీరు పెట్టుకోవడం చూసి అభిమానులు చాలా ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ప్రభాస్‌ని అలా చూసి తట్టుకోలేకపోతున్నారు అభిమానులు. నిన్ను ఇలా చూడలేకపోతున్నాం డార్లింగ్.. ఏడవద్దు ప్లీజ్.. అంటూ కామెంట్స్ చేస్తు మరింత ఎమోషనల్ అవుతున్నారు. అలాగే ప్రభాస్‌ను ధైర్యంగా ఉండమని సోషల్ మీడియా వేదికగా చెబుతున్నారు. ఇక ప్రభాస్ పెళ్లి గురించి ఎంతో ఆరాటపడే కృష్ణంరాజు.. పెళ్లి చూడాలనే కోరిక తీరకుండానే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఈ విషయం ప్రభాస్ కుటుబంతో పాటు రెబల్ స్టార్ ఫ్యాన్స్‌ను మరింత కలిచివేసింది.