ఆగష్టు 5న రిలీజ్ అయిన బింబిసార మూవీ.. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించి ఇండస్ట్రీకి కొత్త ఊపిరి పోసింది. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా.. మల్లిడి వశిష్ట దర్శకుడిగా పరిచయమవుతూ.. హిస్టారికల్ టచ్ ఇస్తూ.. సోషియో ఫాంటసీ జానర్లో వచ్చిన ఈ సినిమా.. అంచనాలకు మించి విజయాన్ని అందుకుంది. దాంతో డబుల్ లాభాలను తెచ్చిపెట్టింది బింబిసార. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయిన ఈ సినిమా.. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 63 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాల అంచనా. దాంతో బింబిసార2ని భారీ బట్జెట్‌తో ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్టు పనులు కూడా స్టార్ట్ అయినట్టు వార్తలొస్తున్నాయి. వచ్చే ఏడాదిలో షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు.
అయితే సెకండ్ పార్ట్.. బింబిసార ప్రీక్వెల్‌గా తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది. దాంతో ఈ సారి ఇంకొన్ని కొత్త క్యారెక్టర్లు దర్శనమివ్వబోతున్నాయి. బింబిసారలో కేథరీన్, సంయుక్త.. ఇద్దరు హీరోయిన్లు నటించినా.. వాళ్లకు పెద్ద గుర్తింపు దక్కలేదు. కానీ ఈ సారి హీరోయిన్ పాత్రలకు పెద్ద పీట వేయబోతున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు పార్ట్ 2లో లేడీ విలన్‌ను రంగంలోకి దింపబోతున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. పవర్ ఫుల్‌గా ఉండే ఆ పాత్ర కోసం ఓ స్టార్ హీరోయిన్ను తీసుకునే ఆలోచనలో ఉన్నారట. దాంతో ఆమె ఎవరనేది ఆసక్తికరంగా మారింది. అంతేకాదు ఈ ప్రీక్వెల్‌లో.. బింబిసారుడి క్రూరత్వాన్ని చూపించేలా.. హై ఓల్టేజ్ సీన్స్ ప్లాన్ చేస్తున్నట్టు టాక్. అయితే బాలయ్య లేదా ఎన్టీఆర్ బింబిసార సీక్వెల్లో నటించబోతున్నట్టు వార్తలు వస్తునే ఉన్నాయి. కాబట్టి వాళ్లు సెకండ్ పార్ట్‌లో ఉంటారా.. లేదా మరో ప్రీక్వెల్‌లో నటిస్తారా.. అనేది సస్పెన్స్ క్రియేట్ చేస్తోంది. ఏదేమైనా బింబిసార2పై అంచనాలు పెరిగిపోతున్నాయి.