రోడ్డు ప్రమాదం(Road Accident)లో పాపులర్ ప్లే బ్యాక్ సింగర్ రక్షిత సురేష్(Singer Rakshita suresh)కు గాయాలైన సంఘటన మలేషియాలో చోటుచేసుకుంది. ఎయిర్పోర్ట్కు వెళ్లేటప్పుడు ఈ ప్రమాదం(Accident) సంభవించింది. కారులో వెళ్తున్న రక్షిత సురేష్ కు గాయాలయ్యాయి. కారు డివైడర్ ను ఢీకొనడంతోనే ఈ ప్రమాదం జరిగిందని, డ్రైవర్ అప్రమత్తతతో స్వల్ప గాయాలు మాత్రమే అయినట్లు రక్షిత సురేష్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
రెండు సెకన్ల పాటు తన జీవితమంతా ఒక్కసారిగా కనిపించిందని, ఎయిర్ బ్యాగ్స్ తన ప్రాణాలు కాపాడాయని రక్షిత సురేష్(Rakshita suresh) తెలిపింది. ఎయిర్ బ్యాగ్స్ లేకపోతే తన పరిస్థితి దారుణంగా ఉండేదని ఇన్ స్టాగ్రామ్ ద్వారా పోస్ట్(instagram Post) చేసింది. తాను బతకడం అదృష్టంగా భావిస్తున్నానని రక్షిత సురేష్ పోస్టులో రాసుకొచ్చింది.
రక్షిత సురేష్ (Rakshita Suresh)కు రోడ్డు ప్రమాదం జరిగిందని తెలియగానే అభిమానులు ఆందోళన చెందారు. దీంతో తనకు జరిగిన ప్రమాదంపై రక్షిత క్లారిటీ ఇచ్చింది. స్వల్ప గాయాలు మాత్రమే అవ్వడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. కాగా రక్షిత సురేష్ తెలుగులో ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాలోని ‘చల్లగాలి తాకుతున్నది’ పాట(Challa gali Taakutunnadi Song) పాడింది. ఈ మధ్యకాంలో భారీ మల్టీ స్టారర్ సినిమా అయిన ‘పొన్నియన్ సెల్వన్2′(Ponniyan selvan 2 movie)లోనూ ‘కిరునగే’ అనే పాటను కన్నడ ట్రాక్ లో పాడింది.