కర్ణాటక ఓటర్లకు లింక్ చేసిన ఫోన్ నెంబర్లన్నీ ఫేక్ అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలిపారు. చాలా చోట్ల మైనార్టీలు, ఆదివాసీల ఓట్లను EC తొలగిస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి బలమున్న చోట్లే ఓట్ల తొలగింపు జరిగిందన్నారు. ఈ ఓట్లను తొలగించేందుకు కొందరు వ్యవస్థను హైజాకు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అయితే ఇవన్నీ ఆరోపణలు కాదని పక్కా ఆధారాలతో చెబుతున్నట్లు వెల్లడించారు.