NTR: గంపలగూడెం మండలంలోని వినగడప-తోటమూల గ్రామాల మధ్య కట్టలేరు వాగుపై నిర్మించిన రహదారి భారీ వర్షాలకు కొట్టుకుపోయింది. దీంతో గత 20 రోజులకుపైగా ఈ మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రవాణా వ్యవస్థ స్తంభించడంతో విద్యార్థులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ వాగు దాటాల్సిన పరిస్థితి ఏర్పడింది.