కర్ణాటక CID ఓట్ల తొలగింపు వివరాలు కోరినా EC స్పందించటం లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఆరోపించారు. కర్ణాటక ఓటర్లకు లింక్ చేసిన నకిలీ ఫోన్ నెంబర్లు ఎవరివని ప్రశ్నించారు. వాటిని ఎవరు ఆపరేట్ చేస్తున్నారో చెప్పాలని నిలదీశారు. ఈ విషయాన్ని నిగ్గు తేల్చటానికి ఓట్ల తొలగింపు ఐడీల వివరాలతో పాటు OTPలు ఇవ్వాలని ఈసీని కోరారు. మహారాష్ట్ర రాజురా స్థానంలో 6,851 ఫేక్ ఓట్లు కలిపారని తెలిపారు.