MDK: తూప్రాన్ మండలం యావాపూర్ గ్రామంలో గురువారం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. సీజనల్ వ్యాధులు, జ్వరాలు వస్తుండడంతో జిల్లా వైద్యాధికారి వైద్య శిబిరాల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు. యావపూర్ గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించి, రోగులకు మందులను అందజేశారు.