»The Teaser Of Town Name Bhairava Kona Is Exciting
Ooru peru Bhairavakona: ఉత్కంఠభరితంగా ‘ఊరు పేరు భైరవ కోన’ టీజర్
హీరో సందీప్ కిషన్ నటిస్తున్న 'ఊరు పేరు భైరవ కోన మూవీ' (Ooru Peru Bhairavakona Movie) టీజర్లోని డైలాగ్స్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ఉత్కంఠ భరితంగా మూవీ ఉంటుందని టీజర్ (Teaser)ను చూస్తే తెలుస్తోంది.
టాలీవుడ్(Tollywood) యంగ్ హీరో సందీప్ కిషన్(Sandeep kishan) చాలా రోజుల నుంచి కమర్షియల్ హిట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. విభిన్న కథాంశాలతో సినిమా చేస్తున్నప్పటికీ సక్సెస్ రేట్ మాత్రం చాలా తక్కువగానే ఉంది. తాజాగా వచ్చిన మైఖేల్ మూవీ(Mikhel Movie) కూడా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇటువంటి తరుణంలో మరో కొత్త జానర్ లో సినిమా చేస్తున్నాడు. మిస్టరీ, హర్రర్ కలగలిపి కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘ఊరు పేరు భైరవ కోన’ సినిమా(Ooru Peru Bhairavakona Movie) చేశాడు.
తాజాగా ‘ఊరు పేరు భైరవ కోన’ సినిమా(Ooru Peru Bhairavakona Movie) కు సంబంధించిన టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్(Teaser Release) చేసింది. ఈ సినిమా మొత్తం గరుడ పురాణం చుట్టూ తిరుగుతుందని టీజర్ ను చూస్తే అర్థం అవుతుంది. శ్రీకృష్ణ దేవరాయ కాలంలో చెలామణిలో ఉన్న గరుడపురాణానికి, ఇప్పటి గరుడ పురాణానికి నాలుగు పేజీలు తగ్గాయనే డైలాగ్ టీజర్లో హైలెట్గా నిలిచింది. ఆ నాలుగు పేజీలే భైరవ కోన అనే డైలాగ్ తో టీజర్(Teaser) ముగుస్తుంది.
‘ఊరు పేరు భైరవ కోన మూవీ’ (Ooru Peru Bhairavakona Movie) టీజర్లోని డైలాగ్స్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ఉత్కంఠ భరితంగా మూవీ ఉంటుందని టీజర్ (Teaser)ను చూస్తే తెలుస్తోంది. మాయమైన పేజీల్లో ఏం ఉన్నాయి? అసలు భైరవ కోనలో ఏం జరగుతోంది? నాలుగు పేజీల్లో భైరవకోన మారడం ఏంటి? అనే అంశాలపై సినిమా సాగుతుంది. ఈ మూవీకి శేఖర్ చంద్ర బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం సినిమాలకు దర్శకత్వం వహించిన వీఐ ఆనంద్ ఈ మూవీకి కూడా దర్శకత్వం వహించారు. ఈ మూవీలో సందీప్ కిషన్ (Sandeep kishan)కు జోడీగా కావ్యా థాపర్, వర్ష బిల్లమ్మ నటిస్తున్నారు.