తెలుగులో 'ఝుమ్మంది నాదం' మూవీతో పరిచయం అయిన హీరోయిన్ తాప్సీ(Taapsee). ఆ సినిమా తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్, వీర, గుండెల్లో గోదారి వంటి సినిమాలు చేసి పాపులర్ అయ్యింది. తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ భాషల్లో కూడా తాప్సీకి వరుస అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం ఆమె వెబ్ సిరీస్(Web series)లోనూ నటిస్తోంది. చాలా మంది తాప్సీని మగరాయుడిలా ఉంటుందని, ఎవరి మాటా వినదని చెబుతుంటారు. ప్రస్తుతం తాప్సీ బాలీవుడ్(Bollywood)లో రెండు సినిమాలు చేస్తోంది.
తెలుగులో ‘ఝుమ్మంది నాదం’ మూవీతో పరిచయం అయిన హీరోయిన్ తాప్సీ(Taapsee). ఆ సినిమా తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్, వీర, గుండెల్లో గోదారి వంటి సినిమాలు చేసి పాపులర్ అయ్యింది. తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ భాషల్లో కూడా తాప్సీకి వరుస అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం ఆమె వెబ్ సిరీస్(Web series)లోనూ నటిస్తోంది. చాలా మంది తాప్సీని మగరాయుడిలా ఉంటుందని, ఎవరి మాటా వినదని చెబుతుంటారు. ప్రస్తుతం తాప్సీ బాలీవుడ్(Bollywood)లో రెండు సినిమాలు చేస్తోంది.
తాజాగా తాప్సీ(Taapsee)పై పోలీసు కేసు నమోదైంది. ఆమె ఓ ఫ్యాషన్ షోలో కనపడిన తీరుపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మార్చి 12న ముంబైలో లాక్ మీ ఫ్యాషన్ వీక్2023 ఫ్యాషన్ షో జరిగింది. ఈ షోలో తాప్సీ ర్యాంప్ వాక్ చేసింది. ఆ షోలో తాప్సీ(Taapsee) తన మెడలో హిందువులు ఆరాధించే లక్ష్మీ దేవి లాకెట్ ను ధరించింది ర్యాంప్ వాక్ చేసింది. ప్రైవేటు పార్ట్స్ కనపడేలా లక్ష్మీదేవి లాకెట్ ధరించి ర్యాంప్ వాక్ చేయడంపై హింధూసంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఛత్రిపుర పోలీసు స్టేషన్ లో హీరోయిన్ తాప్సీ(Taapsee)పై కేసు నమోదైంది. ఇండోర్ లోని హింద్ రక్షక్ సంగతన్ కన్వీనర్, బీజేపీ(BJP) ఎమ్మెల్యే మాలిని తనయుడు అయిన ఏకలవ్య గౌర్ తాప్సీపై కేసు వేశారు. మతపరమైన మనోభావాలను దెబ్బ తీసిందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నాడు. సనాతన ధర్మాన్ని ఆమె చులకన చేసిందని ఏకలవ్య గౌర్ ఆరోపణలు చేశారు. అయితే దీనిపై తాప్సీ(Taapsee) ఇంకా స్పందించలేదు.