ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ కు సంబంధించిన పవన్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. పోలీస్ స్టేషన్లో పవన్ బ్యాక్ సైడ్ కు సంబంధించిన ఫోటోను మేకర్స్ రిలీజ్ చేశారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan), డైరెక్టర్ హరీశ్ శంకర్(Harish shankar) కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ మూవీ.. అప్పట్లో బాక్సాఫీస్‌ని షేక్ చేసేసింది. ఇప్పటి వరకు హరీష్ శంకర్ చేసిన సినిమాల్లో ఇదే బిగ్గెస్ట్ హిట్. దాంతో మరోసారి పవర్ స్టార్‌తో మ్యాజిక్ చేయాలని చూస్తున్నాడు. అందుకే గత రెండు, మూడేళ్లుగా.. చేస్తే పవన్‌తోనే సినిమా చేస్తానని వెయిట్ చేస్తున్నాడు హరీశ్ శంకర్. ఎట్టకేలకు ఈ మధ్యే ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ పైకి వెళ్లింది. దాంతో ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్‌కు టైం ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.
ఇప్పటికే ఓ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల(sree leela) హీరోయిన్గా నటిస్తోంది. పవన్, శ్రీలీల కాంబోని స్క్రీన్ పై చూసేందుకు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు పవన్(Pawan Kalyan) ఫ్యాన్స్. గబ్బర్ సింగ్ కాంబో కావడంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ ఆశలే పెట్టుకున్నారు. అయితే ఇది తమిళ్ హిట్ మూవీ తేరీ రీమేక్ అనే టాక్ నడుస్తోంది. అయినా హరిష్ శంకర్(Harish shankar) చేసిన మార్పులతో.. ఉస్తాద్ భగత్ సింగ్ సాలిడ్‌గా ఉంటుందని అంటున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు.. పోలీస్ స్టేషన్లో జస్ట్ పవన్ బ్యాక్ సైడ్‌కు సంబంధించిన ఓ ఫోటోని రిలీజ్ చేశారు.
ఇప్పటి వరకు ఫస్ట్ లుక్ కూడా రివీల్ చేయలేదు. కానీ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఉస్తాద్ గ్లింప్స్ రిలీజ్ టైం ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. గబ్బర్ సింగ్ మూవీ 2012 మే 11న రిలీజ్ అయింది. ఈ ఏడాదికి ‘గబ్బర్ సింగ్’ విడుదలై 11 ఏళ్ళు కంప్లీట్ అవుతుంది. ఈ సందర్భంగా.. మే 11న ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ రిలీజ్ చేయాలని భావిస్తున్నారట మేకర్స్. ఈ గ్లింప్స్ గబ్బర్ సింగ్ రేంజ్లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. అదే జరిగితే.. ఆ రోజు పవన్(Pawan Kalyan) ఫ్యాన్స్ దెబ్బకు సోషల్ మీడియా హోరెత్తి పోవడం ఖాయం. ఇక ఈ చిత్రానికి కూడా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. మరి ఉస్తాద్ భగత్ సింగ్ ఎలా ఉంటుందో చూడాలి.