ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్(pawan kalyan) ఓ వైపు రాజకీయాలు, మరోవైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే ఈ రెండింటిలో ఒకదానికి ఫుల్ టైం కేటాయించే సమయం రానే వచ్చేస్తోంది. అందుకే వపర్ స్టార్ మూవీ మేకర్స్‌కు డెడ్ లైన్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.
పవన్(pawan kalyan) కెరీర్లో ఇంత స్పీడ్‌గా, ఇన్ని సినిమాలు చేసిన సందర్భాలు లేవు. ఒకేసారి నాలుగు సినిమాలను పరుగులు పెట్టిస్తున్నారు పవర్ స్టార్. రోజుకు రెండు కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు. ప్రస్తుతం చేస్తున్న నాలుగు సినిమాల్లో ఓ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసేశారు. తమిళ్ రీమేక్ మూవీ వినోదయ సీతమ్‌లో.. తన పార్ట్‌కు సంబంధించిన షూటింగ్ ఫినిష్ చేశారు.
ఇక ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ ఓవర్ స్పీడ్‌తో దూసుకుపోతున్నాయి. ఈ రెండు సినిమాలు ఇప్పటికి ఈక్వల్‌గా ఒకటి అర షెడ్యూల్స్ పూర్తి చేసుకున్నాయి. సుజీత్ తెరకెక్కిస్తున్న ఓజి యాక్షన్ సీన్స్ సహా ఓ సాంగ్ షూట్ కూడా కంప్లీట్ చేసుకుంది. నెక్స్ట్ షెడ్యూల్ ఈ నెల నుంచే స్టార్ట్ కానుందని తెలుస్తోంది.
దీని తర్వాత వెంటనే ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. ఇంటర్వెల్‌కి ముందు వచ్చే ఓ సాంగ్‌ను షూట్ చేయబోతున్నారట దర్శకుడు క్రిష్. ఈ మంత్ ఎండింగ్లో రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేయనున్నారట. ఈ సినిమా అయిపోయిన వెంటనే.. హరీష్ శంకర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింట్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు.
నెక్స్ట్ షెడ్యూల్‌ని ఏపిలో ప్లాన్ చేస్తున్నారట. జూన్ సెకండ్ వీక్‌లో ఈ షెడ్యూల్ ఉండొచ్చునని తెలుస్తోంది. మొత్తంగా వచ్చే ఆరు నెలల్లో అన్ని సినిమాల షూటింగ్ పార్ట్‌ను ముగించాలని.. పవన్ తన నిర్మాతలకు డెడ్‌లైన్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.
ఆ తర్వాత వచ్చే ఏడాదిలో జరగనున్న ఏపీ ఎలక్షన్స్ టార్గెట్‌గా పవన్ ముందుకు సాగనున్నారు. ఎలక్షన్స్ రిజల్ట్‌ను బట్టి.. పవన్ నెక్స్స్ సినిమాలు ఉంటాయా? లేదా? అనేది తెలియనుంది.