వార్ 2 చిత్రం(war2 movie) గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. ఈ మూవీలో ఇప్పటికే హృతిక్, జూనియర్ ఎన్టీఆర్ యాక్ట్ చేస్తుండగా..హీరోయిన్ ఎవరనే టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో అలియా భట్(alia bhatt) ఈ చిత్రంలో నటించనున్నట్లు తెలుస్తోంది.
ప్రాజెక్ట్ K(Project K) అనేది ఇప్పటివరకు భారతీయ తెరపై నిర్మించిన అత్యంత ఖర్చుతో కూడిన చిత్రం. ఈ మూవీలో ప్రభాస్(prabhas) యాక్ట్ చేస్తున్న నేపథ్యంలో ఈ చిత్రంపై భారీగా అంచనాలు పెరిగాయి. ఈ క్రమంలో తాజాగా మేకర్స్ ఈ చిత్రంలోని 'రైడర్స్' కోసం కాస్ట్యూమ్స్ మేకింగ్ చూపించే వీడియోను విడుదల చేశారు. ఈ రైడర్‌లు ప్రాజెక్ట్ Kలో విలన్ లేదా సైన్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ వీడియోను మీరు కూడా ఓసారి చూసేయం...
ఏషియన్ ఫిలిమ్స్(asian films) నారాయణ దాస్ నారంగ్ సమర్పణలో ఒక సరికొత్త పిరియాడిక్ ఫిల్మ్ రూపొందుతోంది. ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ ప్రొడక్షన్ నెంబర్:1 చిత్రాన్ని ప్రముఖ వ్యాపారవేత్త రవి కుమార్ పనస(Ravikumar Panasa) నిర్మిస్తున్నారు. మసూద ఫేమ్ తిరువీర్(thiruveer) ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. నూతన దర్శకుడు జి.జి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఇటీవల ప్రారంభమయ్యాయి.
బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్(Alia Bhatt) చూస్తే చిన్న పిల్లలాగా అనిపిస్తుంది. కానీ ఈ అమ్మడు ప్రస్తుతం దేశంలో అత్యధికంగా పారితోషకం తీసుకునే హీరోయిన్ల జాబితాలో టాప్ లో నిలిచినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె ఒక్కో చిత్రానికి రూ.20 కోట్లు తీసుకుంటున్నట్లు తెలిసింది. అంతేకాదు ఆమెకు ఆస్తులు కూడా ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Power Star Pawan Kalyan) యాక్ట్ చేసిన వకీల్ సాబ్(Vakeel Saab) చిత్రం నిన్నటితో రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన వేణు శ్రీరామ్(venu sriram) అభిమానులతో చిట్ చాట్ నిర్వహించారు. ఆ క్రమంలో వకీల్ సాబ్ 2 కూడా పక్కాగా ఉంటుందని ఆయన క్లారిటీ ఇచ్చారు.
Jr NTR : ప్రస్తుతం కొత్త సినిమాల కంటే.. హిట్ సినిమా రీ రిలీజులే ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇస్తున్నాయి. టాలీవుడ్‌లో రీ రిలీజ్ సినిమాలు భారీ వసూళ్లను రాబడుతున్నాయి. పోకిరితో మొదలైన ఈ ట్రెండ్ తాజాగా ఆరెంజ్ వరకు కొనసాగుతునే ఉంది. రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ మూవీ అప్పట్లో డిజాస్టర్‌గా నిలిచింది. కానీ ఈ కల్ట్ క్లాసిక్‌ని రీ రిలీజ్ చేస్తే.. ఏకంగా మూడు కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.
ఆస్కార్ అవార్డు గ్రహీతలైన పాటల రచయిత చంద్రబోస్, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణితో ఆర్ఆర్ఆర్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిని తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. హైదరాబాద్ లోని శిల్పాకళా వేదికలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమానికి సినీ రంగ ప్రముఖులు, రాజకీయ నాయకులు తదితరులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
ఆర్ఆర్ఆర్(RRR) సినిమా ఆస్కార్ అవార్డు(Oscar award)ను సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని నాటు నాటు పాట(Natu Natu song)కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ వరించింది. తాజాగా ఆస్కార్ విజేతలకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు. హైదరాబాద్ లోని శిల్ప కళా వేదికలో ఆస్కార్ విజేతలు మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి(MM Keeravani), చంద్రబోస్ (Chandrabose)లను మంత్రులు ఘనంగా ...
నేచురల్ స్టార్ నాని(Natural star nani) నటించిన లేటెస్ట్ మూవీ దసరా(Dasara). ఈ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ను కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల(Srikanth odela) అందుకున్నారు. దసరా(Dasara) సినిమాలో డిలీట్ చేసిన ఓ సీన్ ను మూవీ మేకర్స్ విడుదల(Deleted scene release) చేశారు. ఆ సీన్ లో వెన్నెల ఆవేదనను చూపించారు.
నందమూరి తారకరత్న(Nandamuri Tarakaratna) మరణంతో ఆయన భార్య అలేఖ్య రెడ్డి(Alekhya Reddy) ఒంటరైంది. భర్తను మర్చిపోలేక తమ జీవితంలోని గుర్తులను తలచుకుంటూ కాలాన్ని వెల్లదీస్తోంది. తాజాగా ఆమె తన భర్తకు సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అలేఖ్య రెడ్డి షేర్ చేసిన ఆ ఎమోషనల్ వీడియో(Emotional video) నెట్టింట వైరల్(Viral) అవుతోంది.
నటుడు గీతానంద్, నేహా సోలంకి యాక్ట్ చేసిన గేమ్ ఆన్(GameOn) చిత్రాన్ని ఈ సమ్మర్లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి దయానంద్ దర్శకత్వం వహించగా..రవి కస్తూరి నిర్మాతగా వ్యవహరించారు. మరోవైపు ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి.
నటి ఉర్ఫీ జావెద్(Urfi Javed) ఆమె 15 ఏళ్ల వయసులో జరిగిన ఓ కీలక సంఘటన గురించి పంచుకుంది. తన ఫేస్ బుక్ పోస్టులో పెట్టిన చిత్రాన్ని ఎవరో అడల్ట్ సైట్లో పెట్టారని తెలిపింది. అది తెలిసిన ఆమె తండ్రి తీవ్రంగా కొట్టినట్లు వెల్లడించింది.
నటుడు మంచు మనోజ్(Manchu Manoj) తమకు విలువైన గిఫ్ట్ పంపించినందుకు స్టార్ హీరో రామ్ చరణ్(ram charan), ఉపాసన(Upasana) దంపతులకు అభినందనలు తెలియజేశారు. అంతేకాదు త్వరలోనే మిమ్మల్ని కలుస్తానని ఆయన పేర్కొంటూ ట్విట్టర్ వేదికగా గిఫ్ట్ ఫొటోలను పంచుకున్నాడు. ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్ వైరల్ అవుతున్నాయి.
మణిరత్నం(Maniratnam) డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన పొన్నియన్ సెల్వన్(Ponniyan selvan) సినిమా రెండో పార్టు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే పొన్నియన్ సెల్వన్1 సినిమా మంచి విజయం సాధించింది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా పొన్నియన్ సెల్వన్2(Ponniyan selvan2) సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకు సంబంధించిన సాంగ్(Song)ను చిత్ర యూనిట్ రిలీజ్(Release) చేసింది.
బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్(Varun Dhawan) కపుల్ పేరెంట్స్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ముంబై ఖార్‌లోని సంతానోత్పత్తి క్లినిక్ వెలుపల వరుణ్ తన భార్యతో కనిపించిన నేపథ్యంలో వీరిద్దరు వారి మొదటి బిడ్డ కోసం ఎదురు చూస్తున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దీంతోపాటు కొంతమంది ముందుగానే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.