»Varun Dhawan Couple Who Are Going To Be Parents Netizens Are Already Wishing
Varun Dhawan: పేరెంట్స్ కాబోతున్న వరుణ్ ధావన్ కపుల్?.. ముందే విశ్ చేస్తున్న నెటిజన్లు
బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్(Varun Dhawan) కపుల్ పేరెంట్స్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ముంబై ఖార్లోని సంతానోత్పత్తి క్లినిక్ వెలుపల వరుణ్ తన భార్యతో కనిపించిన నేపథ్యంలో వీరిద్దరు వారి మొదటి బిడ్డ కోసం ఎదురు చూస్తున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దీంతోపాటు కొంతమంది ముందుగానే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్(Varun Dhawan) అతని భార్య నటాషా దలాల్(Natasha Dalal)ఇటీవల ఓ సంతానోత్పత్తి క్లినిక్ దగ్గర కనిపించారు. అంతే ఈ వీడియో చూసిన నెటిజన్లు పేరెంట్స్ కాబోతున్నందుకు ముందుగా శుభాకాంక్షలు అంటూ కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు యంగ్ సూపర్ హీరో అంటూ ఇంకా పలు రకాలుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. వీడియోలో వరుణ్ బ్లూకలర్ టీ-షర్ట్ ధరించి షూస్‌తో క్యాజువల్ లుక్‌లో కనిపిస్తుండగా, నటాషా అబ్స్ట్రాక్ట్ ప్రింట్‌తో కూడిన మోనోక్రోమటిక్ డ్రెస్‌ని ధరించింది. ఇద్దరూ క్లినిక్ నుంచి బయటికి నడిచి కారు లోపలికి వెళుతుండటం వీడియోలో కనిపించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది.
ముంబై(mumbai)లోని ఖార్లోని సంతానోత్పత్తి క్లినిక్ వెలుపల వీరిద్దరు ఇటీవల కనిపించారు. దీంతో కనిపించినప్పటి నుంచి వారి మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నారనే పుకార్లు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. క్లినిక్‌కి వారు వెళ్లి వచ్చిన తర్వాత చాలా మంది నెటిజన్లు వారి మొదటి బిడ్డను స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నారని ఊహిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం బాలీవుడ్లో అత్యంత ఇష్టపడే జంటల్లో వరుణ్(Varun), నటాషా కూడా ఒకరు. అవార్డ్ ఫంక్షన్లు, డిన్నర్ డేట్లు, సెలబ్రిటీ ఈవెంట్లలో వారి మనోహరమైన ప్రదర్శనలను ఇద్దరూ తరచుగా పంచుకుంటారు. వరుణ్ చివరగా కృతి సనన్ సరసన భేదియాలో యాక్ట్ చేశాడు. ప్రస్తుతం జాన్వీ కపూర్ సరసన బవాల్‌లో మూవీలో యాక్ట్ చేస్తున్నాడు. సినిమాలతో పాటు వరుణ్ ప్రస్తుతం నటి సమంతా రూత్ ప్రభుతో కలిసి సిటాడెల్ ఇండియన్ వెర్షన్ షూటింగ్లో బిజీగా ఉన్నారు.
వరుణ్ ధావన్, నటాషా దలాల్ చాలా సంవత్సరాలు ఒకరితో ఒకరు డేటింగ్(dating) చేసిన తర్వాత జనవరి 24, 2021న పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ ఎదురుచూస్తున్నట్లు పుకార్లు రావడం ఇదే మొదటిసారి కాదు. నవంబర్ 2022లో కూడా ఈ జంట తమ మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నారని ఊహాగానాలు వచ్చాయి, కానీ వారు తర్వాత వాటిపై క్లారిటీ ఇచ్చారు. మరి ఈసారి మళ్లీ స్పందిస్తారో లేదో చూడాలి.