సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ కేసు గుబులు రేపుతోంది. కబాలి నిర్మాత కేపీ చౌదరి అరెస్ట్ అవ్వడంతో పోలీసులు ఆయన కాంటాక్ట్స్ లిస్ట్ పరిశీలించారు. తాను 12 మందికి కొకైన్ అమ్మినట్లు కేపీ చౌదరి అంగీకరించడంతో పోలీసులు ఆ 12 మందికి నోటీసులు పంపారు.
ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ చిత్రం 'ప్రాజెక్ట్ కె(project k)' ప్రకటించినప్పటి నుంచి ఏదో ఒక వార్తల్లో నిలుస్తోంది. ఈ చిత్రంలో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, ప్రభాస్, దీపికా పదుకొనే, దిశా పటానీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు చిత్రసీమలో అతిపెద్ద నిర్మాణ సంస్థ అయిన వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కమల్ హాసన్ కీలక పాత్ర పోషించనున్నట్లు మేకర్స్ ఈ మేరకు ప్రకటించారు.
హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి స్టైలిష్ డ్రైస్సులు ధరించి అభిమానులను అలరిస్తుంది. మోడల్ తర్వాత హీరోయిన్ ఈ అమ్మడు ఫ్యాషన్ దుస్తుల్లో పలు ఫొటోలకు ఫోజులిచ్చి ఆకట్టుకుంటుంది.
ప్రముఖ దర్శకుడు SS రాజమౌళి తన తదుపరి చిత్రం కోసం సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి పని చేయనున్నారు. ఈ క్రమంలో రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఏడాది కాలంగా ఈ మూవీ కోసం స్క్రిప్ట్‌పై వర్క్ చేస్తున్నారు. పేరు పెట్టని ఈ ప్రాజెక్ట్ గురించి ఆయన కీలక విషయాలు పంచుకున్నారు.
ప్రముఖ పంజాబీ సింగర్ AP ధిల్లాన్ కొద్ది రోజుల క్రితం విడుదలైన 'ట్రూ స్టోరీస్' అనే తన తాజా ట్రాక్‌తో తిరిగి వచ్చాడు. బోనీ కపూర్, దివంగత నటి శ్రీదేవిల చిన్న కుమార్తె ఖుషీ కపూర్ గురించి AP ధిల్లాన్ చేసిన ప్రస్తావన ఇంటర్నెట్‌లో బాగావైరల్ అవుతోంది.
'తొలిప్రేమ' విడుదలై ఈ ఏడాదితో 25 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా 4kలో ఈ మూవీని విడుదల చేస్తున్నారు. జూన్ 30వ తేదిన 300కి పైగా థియేటర్లలో ఈ మూవీ భారీగా రీ రిలీజ్ కానుంది. హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోస్‌లో ఈ ఈవెంట్ నిర్వహించారు. ట్రైలర్ రిలీజ్ చేశారు.
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది ఇలియానా. ఆమె నడుము అందాలతో అందరినీ మంత్రముగ్ధులను చేసేసింది. చాలా కాలం టాలీవుడ్ లోని దాదాపు అందరు యంగ్ హీరోలతో ఆడి పాడింది. ఆ తర్వాత బాలీవుడ్ కి తన మకాం మార్చేసింది. అక్కడ కూడా వరస అవకాశాలు చేజిక్కిచుక్కున్న ఈ గోవా అందం ప్రస్తుతం తల్లికాబోతోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దెబ్బకు ఓ హీరోయిన్ కెరీర్ క్లోజ్ అయిందా? అంటే ఔననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అసలు పవర్ స్టార్‌తో ఛాన్స్ వస్తే చాలని అంటుంటారు హీరోయిన్లు. అలాంటి వారిలో కొద్దిమందికే ఆఫర్స్ వస్తుంటాయి. కానీ ఊహించని విధంగా తన ఫిగర్‌కు పవన్‌తో ఛాన్స్ అందుకుంది ఓ ముద్దుగుమ్మ. కానీ ఏం లాభం.. ఈ సినిమాతో అమ్మడు కనిపించకుండానే పోయింది. ఇంతకీ ఎవరా ముద్దుగుమ్మ?
నాగ చైతన్య, సమంత ఎప్పుడు హాట్ టాపికే. ఈ ఇద్దరి గురించి ఎలాంటి న్యూస్ వచ్చినా సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతుంది. ఈ ఇద్దరు విడిపోయి చాలా రోజులే అవుతోంది. అయినా కూడా సమయం వచ్చినప్పుడల్లా.. ఇద్దరు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారుతున్నారు. అయితే ఈ మధ్యే కాస్త పుకార్లు తగ్గాయి. కానీ తాజాగా సమంత, చైతన్య విడాకులపై అక్కినేని అమల షాకింగ్ కామెంట్స్ చేసినట్టుగా తెలుస్తోంది.