మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని కలిసి ఫస్ట్ టైం 'స్కంద' అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాతో ఇద్దరు పాన్ ఇండియా మార్కెట్‌లో సెటిల్ అయిపోవాలని చూస్తున్నారు. అలాగే తమన్ కూడా పాన్ ఇండియా లెవల్లో సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. అందుకే.. ఇక నుంచి ర్యాపో కాదు ర్యాంపో అంటున్నాడు.
ప్రజెంట్ యావత్ ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్న అతిపెద్ద అనౌన్స్మెంట్ రాజమౌళి, మహేష్ బాబు ప్రాజెక్ట్ మాత్రమేనని చెప్పొచ్చు. ఈ క్రేజీ కాంబో కన్ఫామ్ అయిపోయింది. కానీ.. అధికారిక ప్రకటన మాత్రం బయటికి రాలేదు. కానీ రచయిత విజయేంద్ర ప్రసాద్ మాత్రం సాలిడ్ అప్డేట్స్ ఇస్తున్నారు. అదెంటో చుద్దాం.
యంగ్ హీరో శర్వానంద్(sharwanand)కు అసలు ఏమైంది? అని ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్స్ కూడా కాస్త ఆందోళన పడుతున్నారు. ఎందుకంటే సోషల్ మీడియాలో సర్జరీ అంటూ.. ఏదేదో వార్తలు వస్తున్నాయి. అంతేకాదు అమెరికాకు కూడా వెళ్లినట్టుగా తెలుస్తోంది.
పవన్ కల్యాణ్ ఓజీ టీజర్‌పై హైప్ నెలకొంది. మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ కానప్పటికీ మూవీకి ఎక్కడ లేని క్రేజ్ తీసుకొచ్చారు దర్శకుడు సుజిత్. పవన్ బర్త్ డే సందర్భంగా సెప్టెంబర్ 2వ తేదీన టీజర్ రిలీజ్ చేస్తారని తెలుస్తోంది.
కన్నడ పరిశ్రమలో అద్భుతమైన విజయాన్ని సాధించిన చిత్రాన్ని తెలుగులో అన్నపూర్ణ, ఛాయ్ బిస్కెట్ సంస్థలు బాయ్స్ హాస్టల్ పేరుతో ఈరోజు(ఆగస్టు 26న) థియేటర్లలో విడుదల చేశారు. అయితే ట్రైలర్‌తో ఆసక్తి రేపిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఇప్పుడు తెలుసుకుందాం.
నందమూరి నటసింహం బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఙ హీరోగా ఎంట్రీ ఇస్తే చూడాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు నందమూరి అభిమానులు. కొన్నాళ్లుగా అదిగో ఇదిగో అనే మాటలు వినిపిస్తున్నప్పటికీ..ఎంట్రీ ఎప్పుడనే విషయంలో క్లారిటీ లేదు. కానీ తాజాగా మోక్షజ్ఙపై వేణు స్వామి(Venu Swamy) చెప్పిన జాతకం వైరల్‌గా మారింది.
69వ జాతీయ అవార్డుల్లో భాగంగా ఉత్తమ నటుడిగా నేషనల్ ఫిల్మ్ అవార్డ్ గెలుచుకున్న అల్లు అర్జున్ కు రామ్ చరణ్, తన భార్య ఉపాసన సర్ ప్రైజ్ చేశారు. పుష్ప నటుడుకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. కానీ చెర్రీ, బన్నీ మధ్య మాత్రం ఇంకా కోల్డ్ వార్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
సలార్ సినిమా కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు ప్రభాస్ అభిమానులు(prabhas fans). అందుకే సలార్ నుంచి ఏ ఒక్క చిన్న అప్డేట్ వచ్చిన సోషల్ మీడియాలో అలర్ట్ అయిపోతున్నారు. అయితే ఇప్పుడు ట్రైలర్(Salaar Trailer) అప్టేట్ మేకర్స్ ఇవ్వకపోయినా.. ముహూర్తం ఫిక్స్ అయిందనే న్యూస్ వైరల్ అవుతోంది.
జాన్వీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి చాలా కాలమే అవుతోంది. బాలీవుడ్ లో ఆమె చాలా సినిమాలు చేశారు. కానీ ఇప్పటి వరకు అక్కడ మంచి హింట్ అందుకోలేకపోయింది. దాని కోసం తన వంతు ప్రయత్నం తాను చేస్తూనే ఉంది.
69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో బన్నీకి అవార్డు లభించింది. పుష్ప సినిమాకి గాను అల్లు అర్జున్ ఉత్తమ నటుడు అవార్డుకి ఎంపికయ్యాడు. ఈ అవార్డుకు ఎంపికైన మొట్టమొదటి తెలుగు హీరోగా అల్లు అర్జున్ రికార్డ్ క్రియేట్ చేశాడు. దీంతో అల్లు, మెగా ఫ్యామిలీలో సంబరాలు జరిగాయి. మెగాహీరోలు అల్లు అర్జున్‌ని కలిసి అభినందనలు తెలిపారు. హీరోలు వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, నాగబాబులు బన్నీని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణే గతంలో హాలీవుడ్ లో సందడి చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ‘ట్రిపుల్ ఎక్స్: రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్’ అనే సినిమాలో ఆమె సందడి చేశారు. ఆ సమయంలో ఆ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఆమె విన్ డీజిల్ తో కలిసి ఫోటోలు కూడా దిగారు. వీరిద్దరూ కలిసి ఓ ఆటో కూడా ఎక్కారు. ఆయన ఇండియా వచ్చిన సందర్భంలో ఈ ఫోటోలు దిగినట్లు సమాచారం.
69వ జాతీయ చలనచిత్ర అవార్డులు తాజాగా ప్రకటించారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ దాదాపు 10కి పైగా అవార్డులు గెలుచుకొని సత్తా చాటింది. చాలా మంచి సినిమాలను గుర్తించి వాటికి అవార్డులు ఇవ్వడం చాలా సంతోషించదగిన విషయమే. కానీ విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న కొన్ని సినిమాలకు అవార్డులు రాకపోవడం మాత్రం అందరినీ షాకింగ్ కి గురి చేసింది.
మిల్కీ బ్యూటీ తమన్నా పోలీస్ అధికారి పాత్రలో నటించిన రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన తాజా వెబ్ సిరీస్ ఆఖ్రీ సచ్. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఇప్పుడు చూద్దాం.
బాలీవుడ్ లో ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాలు ఏవీ పెద్దగా ఆకట్టుకోవడం లేదనే చెప్పాలి. అయితే సన్నీ డియోల్(Sunny Deol) ప్రధాన పాత్రలో నటించిన గదర్ 2 మూవీ మాత్రం బాక్సాఫీసు వద్ద అదరగొడుతోంది. రిలీజ్ అయిన రోజు నుంచి కాసుల వర్షం కురిపిస్తోంది.