Boys Hostel Movie Review: స్టోరీ అదుర్స్..పక్కా నవ్వుతారు!
కన్నడ పరిశ్రమలో అద్భుతమైన విజయాన్ని సాధించిన చిత్రాన్ని తెలుగులో అన్నపూర్ణ, ఛాయ్ బిస్కెట్ సంస్థలు బాయ్స్ హాస్టల్ పేరుతో ఈరోజు(ఆగస్టు 26న) థియేటర్లలో విడుదల చేశారు. అయితే ట్రైలర్‌తో ఆసక్తి రేపిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఇప్పుడు తెలుసుకుందాం.
Boys Hostel Movie Review: భాషా, ప్రాంతం పట్టించుకోకుండా సినిమా బాగుంటే చాలు. ఆదరించాడానికి తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ సిద్దంగానే ఉంటారు. ఇలా ఇప్పటికే బోలేడు సినిమాలు హిట్టు కొట్టాయి. అలాంటి కోవలోకే వస్తుంది బాయ్స్ హాస్టల్(Boys Hostel) చిత్రం. కన్నడలో హిట్ టాక్ తెచ్చకున్న హాస్టల్ హుడుగారు బేకగిద్దరే చిత్రం నేడు(ఆగస్టు 26న) తెలుగులో థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అన్నపూర్ణ స్టూడియోస్, ఛాయ్ బిస్కెట్(Annapurna Studios, Chai Biscuit) సంస్థలు సంయుక్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడంతో సినిమాపై ప్రత్యేకమైన ఆసక్తి ఏర్పడింది. మరీ ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో ఇప్పుడు చూద్దాం.
కథ:
అజిత్ (ప్రజ్వల్) ఓ లఘు చిత్రం కోసం తన హాస్టల్(Hostel), రూమ్మేట్స్(Room ments), వార్డెన్(మంజునాథ నాయక్) చుట్టూసాగే ఓ కథ రాసుకుంటాడు. ఆ కథలో స్ట్రిక్ట్ వార్డెన్ మరణిస్తాడు. అతని మరణాన్ని రోడ్డు ప్రమాదంగా మార్చలనేది విద్యార్థుల ప్లాన్ అని కథ చెబుతాాడు. దానికి తోటి స్టూడెంట్స్ ఇదేం కథ అంటారు. అంతే ఒక విద్యార్థి టీ కోసం గదిలోకి వెళ్లి బయటకు వచ్చి ఒక విషయం చెబుతాడు. ఎవరి ఊహించని విధంగా హాస్టల్ వార్డెన్ నిజంగానే మరణిస్తాడు. అయితే తాను ఒక సూసైడ్ నోట్ కూడా రాస్తాడు. అందులో అజిత్ రూమ్మేట్స్ నేమ్స్ ఉంటాయి. ఇక కథలో అసలు ట్విస్ట్ మొదలు అవుతుంది. అతను ఎందుకు మరణించాడు. ఆ లెటర్లో ఏం ఉంది? ఆ తరువాత ఏం జరిగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే:
ఇదోక వినూత్నమైన కథ. ఇది కంప్లీట్‌గా వినోదాన్ని పంచే సినిమా అని చెప్పవచ్చు. అయితే ఇలాంటి ఒక ఆలోచనతో కూడా సినిమా చేయొచ్చా అని ఆశ్చర్యపోతాము. రోటీన్ సినిమాలకు భిన్నంగా ఇది ఉంటుంది. చాలా క్యారెక్టర్లు ఉంటాయి. అన్ని చాలా సరదాగా సాగిపోయే పాత్రలే. ఎక్కడా కూడా బోర్ కొట్టదు. లాజిక్ విషయం పక్కన పెట్టి కడుపుబ్బా నవ్వుకునే సినిమా. ఇది వరకు జాతి రత్నాలు సినిమాలో ఉన్నట్లు ఒక నాలుగు తింగరి క్యారెక్టర్లు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. హాస్టల్ వార్డెన్ ఆత్మహత్య తరువాత అసలు కథ మొదలౌతుంది. బాడీని మాయం చేయాలని వీరు చేసే ప్లాన్స్, దాని కోసం మేధావులని ఫీల్ అయ్యే సీనియర్ల సలహాలు తీసుకోవడం, వాళ్లకి మరో ముగ్గురు సీనియర్లు కలవడం ఇలా సినిమా అంత సందడిగా సాగుతుంది.
ప్రతీ సన్నివేశం నవ్వించేదే. ఇక ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్ అదిరిపోతుంది. ద్వితీయార్థం కాస్తా స్లోగా కథ నడుస్తుంది. కానీ కామెడీ మాత్రం తగ్గదు. సినిమా ఆద్యాంతం నవ్విస్తూనే ఉంటుంది. ఇలాంటి కథలకు సంభాషణలు, నేటివిటీ ముఖ్యం. అయితే తెలగు డబ్బింగ్ చిత్రాలు అనగానే చాలా పాత్రలకు ఒకరే డబ్బింగ్ చెప్పడం తెలుగు నేటివిటీకి తగ్గట్లు మాటాలు లేకపోవడం ఇది వరకు చాలా సినిమాలో చూశాము. కానీ ఈ చిత్రంలో అలాంటివి ఏవి లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ముందే చెప్పుకున్నట్లు లాజిక్స్ పక్కన పెడితే సినిమాను చాలా బాగా ఎంజాయ్ చేయోచ్చు.
ఎవరెలా చేశారు:
ఈ చిత్రంలో ప్రతి పాత్ర కీలకమే. హాస్టల్ వార్డెన్‌గా మంజునాథ నాయక్ ఆకట్టుకుంటారు. నటులు, దర్శకులైన కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి, యూ టర్న్ ఫేమ్ పవన్ కుమార్ సినిమాలో సూపర్ సీనియర్లుగా కనిపించి సందడి చేశారు. చిత్ర దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి మేథావిలా కనిపిస్తూ ప్రసంగాలతో బెదరగొట్టే పాత్రలో కడుపుబ్బా నవ్వించాడు. యాంకర్ రేష్మి సినిమా ఆరంభం నుంచి చివరి వరకూ కనిపిస్తుంది. గ్లామర్‌గా కనిపిస్తూ చివరి వరకూ ఊరిస్తూ ఉంటుంది ఆ పాత్ర. నాయుడుగా తరుణ్ భాస్కర్ చేసే సందడి కూడా కట్టిపడేస్తుంది. సినిమాటోగ్రఫి చాలా బాగుంది. ఈ విభాగంలో అరవింద్ కశ్యప్ గొప్పగా పనిచేశారు. ఎడిటింగ్, అజనీష్ సంగీతం సినిమాకి ప్రధాన బలం. రచయితగా, దర్శకుడిగా నితిన్కృష్ణమూర్తి విజయం సాధించాడు.