తెలుగు సినిమా మార్కెట్ హద్దులు దాటింది. ప్రతి దర్శకుడు తన సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారు. చిన్న హీరో సినిమానా, పెద్ద హీరో సినిమానా అనే తేడా లేకుండా పోయింది. అన్నీ పాన్ ఇండియా లెవల్ లో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. వాటిలో కొన్ని వర్కౌట్ అవుతున్నాయి. కొన్ని డీలా పడిపోతున్నాయి.
పెళ్లి అయిన సరే గ్లామర్ డోస్ తగ్గించేదే అంటోంది లావణ్య పాప. తాజాగా బ్లాక్ డ్రెస్‌లో అందాలను ప్రదర్శించింది. ఆ పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ చక్కర్లు కొడుతున్నాయి.
రామ్ గోపాల్ వర్మ గురించి దర్శకుడు రాజమౌళి కొనియాడిన సంగతి తెలిసిందే. దీనిపై ఎక్స్ వేదికగా వర్మ స్పందించారు. ఆ వర్మ గురించి తాను ఎప్పుడూ వినలేదని రాసుకొచ్చారు.
శ్వేత మర్డర్ మిస్టరీ కోసం వెళ్లిన ఎస్ ఐ అర్జున్ కు తెలిసిన నిజాలకు షాక్ అవుతాడు. చిన్నప్పటినుంచి థూరానికల్ శాడిసమ్ తో బాధ పడుతున్న శ్వేత తన బాయ్ ఫ్రెండ్ కోసం ఒక మర్డర్ చేస్తుంది. వీటన్నింటిని అర్జున్ ఎలా ఛేదించాడు. అర్జున్ ఎంతో ప్రాణంగా ప్రేమించిన నిత్యకు ఏం జరిగింది. మొదటి సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు ఎంతో ఉత్కంఠబరితంగా సాగుతుంది కేస్ 30 మూవి.
జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన సూపర్ స్టార్ రజనీకాంత్.. నెక్స్ట్ ఫిల్మ్ 'జై భీమ్' డైరెక్టర్‌తో చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత సెన్సేషన్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌గో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయనున్నాడు. తాజాగా ఈ సినిమా కోసం ఓ యంగ్ హీరోని రంగంలోకి దించినట్టుగా తెలుస్తోంది.
ప్రస్తుతం సెట్స్ పై ఉన్న పవన్ కళ్యాణ్ సినిమాల పరిస్థితేంటి? అనేది ఎటు తేలకుండా ఉంది. ముఖ్యంగా హరిహర వీరమల్లు విషయంలో ఏం జరుగుతుందో? ఎవరికి క్లారిటీ లేదు. కానీ తాజాగా ఈ సినిమా ఆగిపోయినట్టుగా మరోసారి క్లారిటీ వచ్చినట్టే.
అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న తాజా సినిమా యానిమల్ రిలీజ్‌కు ముందే రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా రణబీర్ కపూర్ కెరియర్‌లో హైయెస్ట్ అడ్వాన్స్ టిక్కెట్ బుకింగ్స్‌లో రికార్డు క్రియేట్ చేసింది. తెలుగులో కూడా టికెట్లు అద్భుతంగా అమ్ముడవుతున్నాయి.
బాలీవుడ్ బాద్ షా, కింగ్ ఖాన్ షారుక్‌పై ప్రముఖ సింగర్ అభిజిత్ భట్టాచార్య సంచలన ఆరోపణలు చేశారు. షారుక్ చాలా కమర్షియల్ అని.. వ్యక్తులను వాడుకుంటారని తెలిపారు.
ఓ బడా హీరో పాన్ ఇండియా సినిమా రిలీజ్ అయితే చాలు.. టికెట్ రేట్లు గట్టిగా పెరిగిపోతాయ్. ఇప్పుడు యానిమల్ విషయంలోనూ అదే జరుగుతోంది. ముఖ్యంగా రెండు నగరాల్లో షాక్ ఇచ్చేలా ఉన్నాయి యానిమల్ టికెట్ ధరలు.
యంగ్ హీరో రామ్ పోతినేని ఇప్పటికే ఓ డేట్ లాక్ చేసుకొని షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. అదే రోజు నేను కూడా వస్తున్నాని అనౌన్స్ చేశాడు. దీంతో ఈ ఇద్దరు యంగ్ హీరోల బాక్సాఫీస్ వార్ ఇంట్రెస్టింగ్‌గా మారింది.
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గురించి అందరికీ తెలిసిందే కదా. తనకంటూ ఒక లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసుకొని సెన్సేషనల్ సినిమాలు చేస్తున్నాడు. ఇక ఇప్పుడు సొంత బ్యానర్ కూడా స్టార్ట్ చేశాడు.
మెగాస్టార్ చిరంజీవి పార్టీ పెట్టి రూ.వెయ్యి కోట్ల సంపాదించారని తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ విమర్శలు చేశారు. త్రిష ఇష్యూలో పరువు నష్టం దావా కూడా వేస్తానని స్పష్టంచేశారు.
ప్రస్తుతం 'గుంటూరు కారం' సినిమాతో బిజీగా ఉన్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. నెక్స్ట్ దర్శక ధీరుడు రాజమౌళితో భారీ ప్రాజెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. మరి రాజమౌళి తర్వాత మహేష్ బాబును డైరెక్ట్ చేసేదేవరు?
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన యానిమల్ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్ మల్లారెడ్డి కాలేజీలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి బాలీవుడ్ పరిశ్రమ గురించి ఆసక్తికరమైన వాఖ్యలు చేశారు. ముంబయి పని అయిపోయిందని, అందరికీ హైదరాబాదే దిక్కు అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
దేశంలో విపరీతమైన ఫేమ్ దక్కించుకున్న సినిమా కాంతారా. ఈ చిత్రానికి రిషబ్ శెట్టి స్క్రీన్ ప్లే రాసి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా రెండో భాగం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు కాంతారా ఎ లెజెండ్ చాప్టర్-1 చిత్రానికి సంబంధించిన రెండవ భాగం మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ వీడియోను మేకర్స్ విడుదల చేయగా..ప్రస్తుతం ఇది ట్రెండింగ్లో కొనసాగుతుంది.