ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న యానిమల్ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో యానిమల్ టీమ్ నిన్న హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించింది. అయితే ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖ దర్శకుడు రాజమౌళి రణ్ బీర్ కపూర్ ను ఓ క్రేజీ ప్రశ్న అడిగారు. అందుకు రణ్ బీర్ ఎలా రియాక్ట్ అయ్యారో ఇప్పుడు చుద్దాం.
నాచురల్ స్టార్ నాని హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించిన 'హాయ్ నాన్న' ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. ఇప్పటికే నాని వరుసగా ప్రమోషన్స్ కార్యక్రమాలు చేస్తున్నాడు. తాజాగా పార్టీ సాంగ్ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు.
మరో మూడు రోజుల్లో థియేటర్లో మోస్ట్ వైలెంట్ మ్యాన్‌ను చూడబోతున్నాం. సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన యానిమల్(Animal) సినిమా సాలిడ్ బజ్‌తో రిలీజ్ కాబోతోంది. బిజినెస్ కూడా అలాగే జరిగింది. మరి యానిమల్ తెలుగు టార్గెట్ ఎంత?
హిట్ ఫట్టుతో సంబంధం లేకుండా.. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు యంగ్ హీరో సుధీర్ బాబు. తాజాగా మరో కొత్త సినిమా టీజర్‌ను రిలీజ్ చేసేశాడు. మరి హరోంహర టీజర్ ఎలా ఉంది? సుధీర్ బాబు హిట్ వచ్చేనా?
యంగ్ హీరో నితిన్ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ అందుకుంటున్నాడు. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో వస్తున్నాడు. అందుకే.. ఈసారి మన మైసమ్మ తల్లిని నమ్ముకున్నాడు. తాజాగా నితిన్ లేటెస్ట్ ఫిల్మ్ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్(extra ordinary man) టీజర్ రిలీజ్ చేశారు.
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ హీరోహీరోయిన్లుగా వస్తున్న టిల్లు స్క్వేర్ చిత్రం నుంచి రాధిక అనే వీడియో సాంగ్ తాజాగా విడుదల అయింది. విడుదలైన గంటకే దాదాపు రెండు లక్షల వ్యూస్‌ను సొంతం చేసుకుని సోషల్ మీడియాలో ఈ సాంగ్ హల్ చల్ చేస్తుంది.
డీప్ ఫేక్ వీడియోలతో సెలబ్రెటీలు ఆందోళన చెందుతున్న వేళా అలియా భట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దాంతో బాలీవుడ్ వర్గాలు ఒక్కసారిగా షాక్ అయ్యాయి. చూడటానికి అచ్చం అలియా భట్‌లానే ఉన్న ఈ వీడియోపై నెటిజన్లు కూడా ఆగ్రహంగా ఉన్నారు.
సైలెంట్‌గా వచ్చి సంచలనం సృష్టించిన కన్నడ చిత్రం కాంతార. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ప్రిక్వెల్‌కు ఫస్ట్ లుక్ విడుదల అయింది. రక్తంతో తడిసిన రిషబ్ కళ్లల్లో అగ్ని గోళాలు నింపుకొని భయంకరంగా కనిపించాడు. ఈ లుక్ చూస్తే గూస్ బంప్స్ వస్తాయి.
బిగ్ బాస్ నుంచి ఈ వారం ఎలిమినేట్ అయిన అశ్విని శ్రీ తన ఫస్ట్ ఎక్స్ క్లూజీవ్ ఇంటర్వ్యూ హిట్ టీవీకి ఇచ్చింది. హౌస్‌లో తన ఎక్స్‌పీరియన్స్ గురించి ప్రేక్షకులతో పంచుకుంది.
సినిమా ఇండస్ట్రీలో ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం మామూలే. ఇటీవలే మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి తన భర్తతో కలిసి ఇంట్లోనే ఉంటోంది.
సినిమా రికార్డులకు కేరాఫ్‌గా నిలిచింది పుష్ప. ఒక్క సినిమా ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. అల్లు అర్జున్ కెరీర్ ను సైతం మలుపు తిప్పింది. ఈ సినిమాతో ఐకాన్ స్టార్‌గా మారడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
పరసురామ్ ఒక బిజినెస్ మ్యాన్. తనకు తన కుతురు అంటే ఎంత ఇష్టం ఉంటుందో, తన దగ్గర పనిచేసే దాసు కూతురు అన్నా అంతే ఇష్టం ఉంటుంది. చిన్నప్పుడే కూతళ్లను మార్చిన పరసురామ్ తన దగ్గర పెరుగుతున్నది దాసు కూతురు అని ఎలాంటి కండిషన్లు పెట్టకుండా మోడర్న్ గా పెంచుతాడు. అదే సమయంలో తన ఇద్దరు కూతుళ్లను డీజే, దుర్గ ఇద్దరు ప్రేమిస్తున్నట్లు తెలుసుకొని వారిని అంతం చేద్దామనుకుంటాడు. వారెవరో కాదు చిన్నప్పుడే తప్పిపోయి...
నటుడు మన్సూర్ అలీఖాన్ హీరోయిన్ త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గత వారం రోజులుగా సోషల్‌మీడియాలో రచ్చ జరిగిన విషయం తెలిసిందే. దీంతో త్రిషకు సారీ కూడా చెప్పాడు. ఇక అంతా అయిపోయింది అనుకుంటే ఈ కేసు మరో మలుపు తిరిగింది. తన మాటలను వక్రీకరించారని, చిరంజీవి, కుష్బూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని వారిపై పరువనష్టం దావా వేస్తా అంటున్నారు.